Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో అలాంటి సినిమాలకు ఊపు రావాల్సిందే..!

కేవలం పాటలకు, కొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితమయ్యే హీరోయిన్స్ సినిమాను లీడ్ చేస్తే ఎలా ఉంటుంది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 11:30 AM GMT
టాలీవుడ్ లో అలాంటి సినిమాలకు ఊపు రావాల్సిందే..!
X

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలతో పాటుగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు కాదు కానీ తెలుగు తెర మీద లేడీ ఓరియెంటెడ్ కథలకు అలాంటి సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఒకప్పటి సినీ తారల నుంచి ఈ తరం భామల వరకు కథానాయిక ప్రాధాన్యత సినిమాల్లో నటించాలని అలాంటి సినిమాలు చేయాలని దర్శక నిర్మాతలకు ఉంటుంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. కేవలం పాటలకు, కొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితమయ్యే హీరోయిన్స్ సినిమాను లీడ్ చేస్తే ఎలా ఉంటుంది.

సరైన కథ పడితే హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు కూడా అద్భుతాలు చేస్తాయి. ఒసేయ్ రాములమ్మ సినిమా నుంచి ఈమధ్య వచ్చిన యశోద వరకు కథ చెప్పే కోణం.. కథానాయిక ప్రాధాన్యతగా కథనం మెప్పించాయి. అయితే ఈ సినిమాలు చేసేందుకు అందర్ మేకర్స్ ఆసక్తి చూపించారు. సినిమాను కేవలం కమర్షియల్ యాంగిల్ లో కాకుండా ఈ కథ ఇలా చెబితే ప్రేక్షకులను మెప్పిస్తుందని కొందరు నిర్మాతలు ఈ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తుంటారు.

అయితే ఎంత చేస్తున్నా టాలీవుడ్ లో ఒకప్పటిలా ఫిమేల్ సెంట్రిక్ సినిమాల సందడి తగ్గిందని చెప్పొచ్చు. హీరోయిన్ మీద బడ్జెట్ పెట్టడం ఎందుకని కొందరు.. అనుకున్న బడ్జెట్ లో సినిమాను పూర్తి చేయలేమని మరికొందరు ఇలా కథనాయిక మోసే కథలను పక్కన పడేస్తున్నారు. అయితే అలాంటి కథలను కాస్త రిస్క్ తీసుకుని చేస్తే అద్భుతాలు చేస్తాయి.

అలాంటి సినిమాల్లో అనుష్క అరుంధతి ఒకటి. ఆ సినిమా వసూళ్లు గురించి అది సాధించిన విజయం గురించి తెలిసిందే. అనుష్క కూడా ఆ తర్వాత భానుమతి అని మరోసారి అలాంటి ప్రయత్నమే చేసింది. ఆ సినిమా కూడా సక్సెస్ అయ్యింది. ఇక సమంత కూడా ఫీమే సెంట్రిక్ సినిమా దారిలో ఓ బేబీ, యశోద, శాకుంతలం సినిమాలు చేసింది.

తెలుగు అమ్మాయి కలర్ స్వాతి మెయిన్ లీడ్ గా కూడా కొన్ని సినిమాలు వచ్చాయి.. రెజీనా కూడా ఇలాంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ కథలకు హీరోయిన్స్ ఓకే అంటున్నా ఆ సినిమాలు తీసే దర్శక నిర్మాతలు తక్కువ అయ్యారని చెప్పొచ్చు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సత్యభామ సెట్స్ మీద ఉంది. ఆ సినిమాతో కాజల్ కెరీర్ లో మొదటిసారి ఫిమేల్ సెంట్రిక్ అటెంప్ట్ చేసింది.

తెలుగుతో పోలిస్తే తమిళ్ లో ఇలాంటి సినిమాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పొచ్చు. అక్కడ స్టార్ హీరోయిన్ నయనతార కమర్షియల్ సినిమాల కన్నా తను సోలో లీడ్ గా చేసే సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. తెలుగులో అలా కమిటెడ్ గా చేసే హీరోయిన్స్ లేకపోయినా సరైన కథ వస్తే మాత్రం అలాంటి సినిమాలు చేయడానికి రెడీ అంటున్నారు.