Begin typing your search above and press return to search.

అతడు.. రేంజ్ లో గుంటూరు కారం దెబ్బలు

ఇక సినిమా షూటింగ్ తర్వాత కూడా హీరోయిన్ పూజా హెగ్డే ని తీసేసి సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న అమ్మాయిని మళ్లీ మొదటి స్థానంలోకి తీసుకువచ్చారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 11:06 AM GMT
అతడు.. రేంజ్ లో గుంటూరు కారం దెబ్బలు
X

త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా గుంటూరు కారం సినిమా పై అంచనాలు ఫస్ట్ లో కంటే ఇప్పుడు హై రేంజ్ లో ఉన్నాయి అని చెప్పావు. అప్పట్లోనే అసలు సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారా లేదా సందేహాలు కూడా వచ్చాయి. మొదట అనుకున్న కథను క్యాన్సిల్ చేసుకుని మళ్లీ గుంటూరు కారం కథను లైవ్ లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇక సినిమా షూటింగ్ తర్వాత కూడా హీరోయిన్ పూజా హెగ్డే ని తీసేసి సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న అమ్మాయిని మళ్లీ మొదటి స్థానంలోకి తీసుకువచ్చారు. ఇక థమన్ ఉంటాడా ఉండడా అని అనుకుంటున్న సమయంలో ధమ్ మసాలా అనే ఫస్ట్ సాంగ్ విడుదల చేసి క్లారిటీ ఇచ్చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా గుంటూరు కారం ఫస్ట్ లో కంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ పాజిటివ్ ట్రాక్ లోకి తీసుకు వస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశంపై కూడా చాలా భిన్నంగా ఉంటుంది అని ఇప్పటికే నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇందులో యాక్షన్ ఫైట్ సన్నివేశాలు గట్టిగానే ఉంటాయని తెలుస్తుంది. గతంలో త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమాలో యాక్షన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పొలం ఫైట్ ఆల్ టైం బెస్ట్ ఫైట్ సీన్స్ లో ఒకటి అని చెప్పవచ్చు.

అంతేకాకుండా టెంపుల్ ఫైట్ సీన్ కూడా ది బెస్ట్ అనే కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇక సినిమా క్లైమాక్స్ లో కూడా అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. ఇక అలాంటి యాక్షన్ సన్నివేశాలు ఇచ్చిన ఈ కాంబినేషన్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో ఎలాంటి ఫైట్స్ తో ఆకట్టుకుంటుందో.. అనే తరహాలో అంచనాలు ఏర్పడ్డాయి. తప్పకుండా గుంటూరు కారంలో కూడా అంతకుమించి అనే యాక్షన్ సీన్స్ ఉంటాయి అని ఒక టాక్ అయితే వస్తోంది.

ముఖ్యంగా గుంటూరు కారం సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక యాక్షన్ సన్నివేశాలతో పాటు హీరో ఇంట్రడక్షన్ తర్వాత ఉండే ఫైట్ సీన్ కూడా త్రివిక్రమ్ స్టైల్ లో ఉంటుందని సమాచారం. మహేష్ అతడులో విలన్స్ ను కొట్టే స్టైల్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు గుంటూరు కారంలో అలాంటి దెబ్బలు గట్టిగానే ఉంటాయని టాక్. మరి ఆడియన్స్ ను ఆ సీన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటాయి అనేది చూడాలి. ఇక ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. వచ్చే వారం సెకండ్ సాంగ్ విడుదల కాబోతోంది.