Begin typing your search above and press return to search.

'స్పిరిట్' పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Aug 2023 4:18 AM GMT
స్పిరిట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. `ప్రాజెక్ట్ -కె`..`మారుతి` సినిమాల షూటింగ్ ముగించిన అనంత‌రం స్పిరిట్ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మారుతి సినిమా షూట్ వీలైనంత వేగంగా పూర్తి చేసి బ‌య‌ట‌కొచ్చా య‌ల‌న్న‌ది డార్లింగ్ ప్లాన్. దానికి త‌గ్గ‌ట్టు మారుతి వేగంగానే షూటింగ్ చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో సందీప్ రెడ్డి స్పిరిట్ ప‌నుల్ని స్పీడ‌ప్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడిగా అర్జున్ రెడ్డిం ఫేం హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వ‌ర్ ని ఫైన‌ల్ చేసినట్లు తెలిసింది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ నేప‌థ్యంతో కూడిన క‌థ కావ‌డంతో సందీప తొలుత బాలీవుడ్ కంపోజ‌ర్ల‌ని దించాల‌ని చూసారు. దీనిలో భాగంగా తాజాగా తెర‌కెక్కిస్తోన్న `యానిమ‌ల్` టీమ్ అయితే బెస్ట్ అనుకున్నారు. అదీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో ఈ ర‌కంగా ఆలోచించారు. కానీ ఇప్పుడా నిర్ణ‌యం మారింది. `యానిమ‌ల్` టీమ్ కంటే హర్ష‌వ‌ర్ద‌న్ అయితేనే బెస్ట్ ఇవ్వ‌గ‌ల‌డ‌ని భావించి అత‌న్నే తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

దీంతో ఇక‌పై సందీప్ మ్యూజిక్ సిట్టింగ్స్ పై నా ఫోక‌స్ చేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో `యానిమ‌ల్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌బీర్ కపూర్-రష్మిక మంద‌న్న జంట‌గా తెర‌కెక్కుతోంది. `క‌బీర్ సింగ్` త‌ర్వాత తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డు తున్నాయి. తెర‌పై కొత్త ర‌ణ‌బీర్ ని ఆవిష్క‌రించ‌బోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. మ‌రో రెండు..మూడు నెల‌ల్లో షూట్ మొత్తం పూర్త‌వుతుంద‌ని స‌మాచారం.

అటుపై పెండింగ్ ప‌నుల్లో బిజీ కానున్నారు. అయితే `స్పిరిట్` చిత్రాన్ని మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ ఏడాది చివ‌రిక‌ల్లా సెట్స్ కి తీసుకెళ్లాలన్న‌ది ప్లాన్ గా తెలిసింది. అప్ప‌టికి ప్ర‌భాస్ ఫ్రీ అయిపోతార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే సెట్స్ లో ఉన్న రెండు సినిమాలు దాదాపు షూట్ ముగింపుకు చేరుకున్నాయి. ఈ నేప‌థ్యంలో స్పిరిట్ ప‌నుల్ని వేగ‌వంతం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నారు. సినిమా దాదాపు ఎనిమిది భాష‌ల్లో రిలీజ్ కానుంది.