Begin typing your search above and press return to search.

రవితేజ వాటిని బాగా ఎంజాయ్‌ చేస్తాడట!

ఈటీవీ విన్‌ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో లో రవితేజ 'ఈగల్‌' సినిమా ప్రమోషన్ లో భాగంగా హాజరు అయ్యారు

By:  Tupaki Desk   |   15 Feb 2024 1:30 AM GMT
రవితేజ వాటిని బాగా ఎంజాయ్‌ చేస్తాడట!
X

మాస్ మహారాజా రవితేజ తాజాగా ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుసగా విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ తాజాగా మంచు మనోజ్‌ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న ఉస్తాద్‌ గేమ్‌ షో లో పాల్గొన్నాడు. ఈ గేమ్‌ షో లో రవితేజ పలు ఆసక్తికర విషయాలను మంచు మనోజ్ తోపంచుకున్నారు.

ఈటీవీ విన్‌ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో లో రవితేజ 'ఈగల్‌' సినిమా ప్రమోషన్ లో భాగంగా హాజరు అయ్యారు. ఆ సమయంలో రవితేజ మీమ్స్ గురించి మాట్లాడారు. బ్రహ్మానందం తో పాటు ఎక్కువగా మీమ్స్ లో కనిపించే హీరో రవితేజ అనడంలో సందేహం లేదు.

బ్రహ్మానందం, రవితేజ కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలకు సంబంధించిన క్లిప్స్ ను ఉపయోగిస్తూ చాలా మంది మీమ్స్ సోషల్ మీడియా ద్వారా వినోదాన్ని పంచుతున్నారు. సందర్భం ఏదైనా కూడా వీరిద్దరూ కలిసి ఉన్న మీమ్స్ ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

ఆ మీమ్స్ గురించి రవితేజ మాట్లాడుతూ... మీమర్స్ చాలా క్రియేటివ్‌ గా ఆలోచిస్తారు. ప్రతి మీమ్‌ ను కూడా నేను బాగా ఎంజాయ్‌ చేస్తాను. మీమ్స్ ను చూసిన సమయంలో మనసారా నవ్వుకుంటాను అంటూ రవితేజ చెప్పుకొచ్చాడు. మీమర్స్‌ షేర్ చేసే పోస్ట్‌ లు ఉల్లాసాన్ని కలిగిస్తాయి అన్నట్లుగా రవితేజ కామెంట్స్ చేశారు.

ఇక రవితేజ కొత్త సినిమాల విషయానికి వస్తే హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్‌ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. హిందీలో సూపర్ హిట్ అయిన సినిమాకు మిస్టర్ బచ్చన్‌ రీమేక్ గా సమాచారం అందుతోంది. ఈ ఏడాదిలోనే మిస్టర్ బచ్చన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.