Begin typing your search above and press return to search.

2023లో ప్ర‌భావ‌వంత‌మైన టాలీవుడ్ స్టార్?

90ఏళ్ల తెలుగు సినిమా హిస్ట‌రీలో ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక న‌టుడిగా అల్లు అర్జున్ సంచ‌ల‌నం సృష్టించాడు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 5:01 PM GMT
2023లో ప్ర‌భావ‌వంత‌మైన టాలీవుడ్ స్టార్?
X

2023లో ఆస్కార్ ల గురించి, జాతీయ అవార్డుల గురించి భార‌త‌దేశంలో ఎక్కువ చ‌ర్చ జ‌రిగింది. దీనికి కార‌ణం టాలీవుడ్. ప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రు ప్రతిభావంతుల క‌ష్ఠ‌ఫ‌లం. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో ఆస్కార్ కొల్ల‌గొట్ట‌డం.. ఆపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు విజయం ఎక్కువ‌గా చ‌ర్చ‌ల్లో నిలిచాయి. అయితే ఆస్కార్ ల‌లో `ఉత్త‌మ న‌టుడు` కేట‌గిరీలో చ‌ర‌ణ్‌, తార‌క్ ల‌కు పుర‌స్కారాలేవీ రాక‌పోవ‌డంతో `ఉత్త‌మ న‌టుడు` కేట‌గిరీలో జాతీయ అవార్డ్ అందుకున్న‌ అల్లు అర్జున్ పేరు ప్ర‌త్యేకంగా మార్మోగింది. ఈ ఏడాది బ‌న్నీ దేశంలోని అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరిగా నిలిచారు.

2023వ సంవత్సరం అల్లు కుటుంబానికి చాలా ప్రత్యేకమైనదిగా మారింది. 90ఏళ్ల తెలుగు సినిమా హిస్ట‌రీలో ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక న‌టుడిగా అల్లు అర్జున్ సంచ‌ల‌నం సృష్టించాడు. ఐకాన్ స్టార్ పాన్-ఇండియన్ పాపులారిటీకి అద‌నంగా జాతీయ అవార్డ్ ద‌క్క‌డంతో అత్యంత ప్రభావవంతమైన సూపర్‌స్టార్‌లలో ఒకరిగా మారారు.

`పుష్ప: ది రైజ్`కి జాతీయ పుర‌స్కారం.. కమర్షియల్ సక్సెస్‌ను మించినదని నిరూపించింది. అల్లు అర్జున్ త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ప్రశంసలకు అర్హుడ‌య్యారు. పుష్ప‌రాజ్ గా త‌న‌దైన‌ న‌ట‌న‌తో మ‌న‌సుల‌పై ఘాడ‌మైన ముద్ర వేయ‌గ‌లిగాడు. అసాధార‌ణ నటన, మైమ‌రిపించే నృత్యంతో బ‌న్ని ప్ర‌త్యేక‌మైన‌వాడిగా ఆక‌ర్షిస్తున్నాడు. అత‌డు న‌టుడిగా అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అతని అభిమానులు ఎంతో గర్వించే మైలురాయి. ఒకే ఒక్క పుష్ప చిత్రంతో భారతదేశం అంతటా అసాధారణంగా ఫాలోయింగ్ ఉన్న స్టార్‌గా ఎదిగాడు. కొన్నేళ్లుగా అత‌డు న‌టించిన సినిమాలు వేరు. ఒక్క పుష్ప చిత్రం వేరు అని నిరూప‌ణ అయింది. మునుముందు అల్లు అర్జున్ తన బహుముఖ ప్రజ్ఞను మరింతగా నిరూపించుకోబోతున్నాడు.

త‌దుప‌రి పుష్ప 2 కోసం బ‌న్ని ఎంతగానో శ్ర‌మిస్తున్నాడు. ఈ సినిమాతో త‌న స్థాయిని మ‌రింతగా పెంచుకోవాల‌న్న త‌ప‌న‌తో ఉన్నాడు. 15 ఆగస్ట్ 2024న విడుదల కానున్న `పుష్ప 2`కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. అల్లు అర్జున్ నటన రేంజ్ .. కమర్షియల్ న‌టుడిగా అత‌డి స్టామినాను థియేట‌ర్ల‌లో వీక్షించేందుకు స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెలకొంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సీక్వెల్‌ను చక్కటి కళాఖండంగా రూపొందిస్తున్నారన్న స‌మాచారం ఉంది.