Begin typing your search above and press return to search.

ఇంద్ర‌జ‌కి నాలుగు నైటీలు కొనిస్తే చాలుట‌!

అలాంట‌ప్పుడు 'నీకు నాలుగు నైటీలు కొనిస్తే చాలు..చీర‌ల ఖ‌ర్చు పెద్ద‌గా ఉండ‌ద‌ని ఆట ప‌ట్టిస్తారుట‌. ఆ విష‌యాన్ని ఇంద్ర‌జ కూడా అంతే స‌ర‌దాగా తీసుకుంటుందిట‌.

By:  Tupaki Desk   |   24 Aug 2023 11:30 PM GMT
ఇంద్ర‌జ‌కి నాలుగు నైటీలు కొనిస్తే చాలుట‌!
X

తెలుగు తెరపై అందాల సందడి చేసిన నిన్నటితరం కథానాయికలలో ఇంద్రజ ఒకరు. అందం.. అభిన‌యం ఆమె సొంతం. 'యమలీల' .. 'సొగసు చూడతరమా' .. 'పిట్టలదొర' లాంటి సినిమాలు ఇంద్ర‌జ‌కి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. కానీ ఆమె కెరీర్ మాత్రం వెండి తెర‌పై ఆశించిన విధంగా సాగ‌లేదు. ప‌రిశ్ర‌కొచ్చిన కొత్త‌లో పెద్ద హీరోయిన్ అవుతుంద‌నుకున్నారు. కానీ ఆర‌క‌మైన ఛాన్సులు రాలేదు.

ఇక సెకెండ్ ఇన్నింగ్స్ లో ఇంద్రజ జ‌ర్నీ తెలిసింది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా స్థిర‌ప‌డ్డారు. బుల్లి తెర షోల‌తోనూ బిజీ అయ్యారు. అలాగే కుటుంబ జీవితంలోనూ ఆమె ఎంతో సంతోషం గా ఉన్నారు. భ‌ర్త‌..పిల్ల‌ల‌తో ఆమెజీవ‌నం సాపీగా సాగుతుంది. తాజాగా ఆలుమ‌గ‌ల మ‌ధ్య ఓ స‌ర‌దా స‌న్నివేశాన్ని ఇంద్ర‌జ ఎంతో సంతోషంగా రివీల్ చేసారు. ఇలాంటి ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని..త‌న ద్వారా అలాంటి స‌మాధానాలు రావాల‌ని ఇంద్రజ ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తుంది.

ఎక్క‌డికి వెళ్లినా సినిమా ప్ర‌శ్న‌లే అడ‌గ‌డంతో త‌న‌కి బాగా బోర్ కొట్టేసిందిట‌. ఇంకా ఇత‌ర ఫ్యామిలీ విష‌యాలు రొటీన్ గానే చెప్ప‌డం అనిపిస్తున్నాయ‌ట‌. ఇలా డిఫరెంట్ గా అడ‌గ‌డం న‌చ్చిందంటూ యాంక‌ర్ ని కూడా పొగిడేసారు ఇంద్ర‌జ‌. ఇంత‌కీ ఆ ఇద్ద‌రి మ‌ధ్య డిస్క‌ష‌న్ దేని గురించో తెలిస్తే షాక్ అవుతారు. ఇంద్ర‌జ బ‌య‌ట‌కి వెళ్లాల‌నుకుంటేనే ముస్తాబ‌వుతుందిట‌. త‌న‌కి న‌చ్చిన చీర‌లు..డ్రెస్ లు వేసుకుంటుందిట‌.

న‌గ‌లు..వ‌డ్డాల‌ను ధ‌రిస్తుందిట‌. ఇంట్లో ఉన్న స‌మ‌యంలో మాత్రం చాలా సింపుల్ గా ఉంటుందిట‌. నైటీ వేసుకుని...త‌లంతా ద‌గ్గ‌ర‌కు ముడేసి ఇంటి ప‌నుల్లోనే మ‌మేకం అవుతుందిట‌. ఇంకే విష‌యాలు పెద్ద‌గా ప‌ట్టించుకోద‌టు. ఎప్పుడైనా బ‌య‌ట‌కి వెళ్లినా ఇంద్ర‌జ అందంగా త‌యార‌వుతుతుందిట‌. భ‌ర్త ఇంట్లో ఉంటే ఇలా ఎందుకు ముస్తాబు అవ్వ‌వ‌ని ఆభ‌ర్త అప్పుడ‌ప్పుడు అడుగుతారుట‌. అలాంట‌ప్పుడు 'నీకు నాలుగు నైటీలు కొనిస్తే చాలు..చీర‌ల ఖ‌ర్చు పెద్ద‌గా ఉండ‌ద‌ని ఆట ప‌ట్టిస్తారుట‌. ఆ విష‌యాన్ని ఇంద్ర‌జ కూడా అంతే స‌ర‌దాగా తీసుకుంటుందిట‌. ఇలాంటి విష‌యాలు మీడియా ఇంట‌ర్వ్యూల్లో చాలాసార్లు చెప్పాల‌నుకుందిట‌. కానీ ఆమెని ఎవ‌రూ అడ‌గ‌క‌పోవ‌డంతో? చెప్ప‌లేక‌పోయాన‌ని' అంది.