Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్ల గ్రాఫ్ నెమ్మ‌దిగా స్కైలోకి

చూస్తుండ‌గానే బ‌డ్జెట్లు కొండెక్కుతున్నాయి. శిఖ‌రాల్ని దాటి ఆకాశం అంచును తాకుతున్నాయి.

By:  Tupaki Desk   |   3 July 2025 9:25 AM IST
బ‌డ్జెట్ల గ్రాఫ్ నెమ్మ‌దిగా స్కైలోకి
X

చూస్తుండ‌గానే బ‌డ్జెట్లు కొండెక్కుతున్నాయి. శిఖ‌రాల్ని దాటి ఆకాశం అంచును తాకుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త‌దేశంలో 1000 కోట్ల బ‌డ్జెట్ ని ఇంకా ఏ సినిమా తాక‌లేదు. అమీర్ ఖాన్ కానీ, రాజ‌మౌళి కానీ మ‌హాభార‌తం సినిమాల‌ను ప్లాన్ చేస్తే, ఫ్రాంఛైజీలో సినిమాల‌న్నిటికీ క‌లిపి 1000 కోట్ల వ‌ర‌కూ బ‌డ్జెట్ ఖ‌ర్చు చేస్తార‌నే ప్ర‌చారం సాగింది.

ఇప్పుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న `రామాయ‌ణం-1` చిత్రానికి దాదాపు 830 కోట్ల (100 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌ర‌కూ ఖ‌ర్చు చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్న సినిమా హీరోగా ర‌ణ‌బీర్ చ‌రిత్ర సృష్టిస్తున్నాడు. ఈ సినిమాకి కేజీఎఫ్ య‌ష్‌, న‌మిత్ పెట్టుబ‌డుల్ని స‌మ‌కూరుస్తున్నారు. 800 కోట్లు మించిన బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు అంటే, దాదాపు 2000 కోట్లు అంత‌కుమించి నెట్ వ‌సూలు చేసేంత పెద్ద హిట్టు కొట్టాల్సి ఉంటుంది.

నిజానికి బ‌డ్జెట్లు ఇలా కొండెక్క‌డానికి తెర‌తీసిన‌ మొద‌టి సినిమా ఏది? అంటే నిస్సందేహంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి. ఈ చిత్రానికి ఆర్కా మీడియా సంస్థ 200 కోట్ల బడ్జెట్ ని ఖ‌ర్చు చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. బాహుబ‌లి 2 చిత్రానికి 250 కోట్లు పెట్టార‌న్న టాక్ ఉంది. అయితే ఈ రెండు సినిమాలు క‌లిపి 2400 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ 2.0 చిత్రానికి 450 కోట్లు ఖ‌ర్చు చేయించాడు శంక‌ర్.

'క‌ల్కి 2898 ఏడి'కి 600కోట్లు, ఆర్.ఆర్.ఆర్ కి 550 కోట్లు, ఆదిపురుష్ కి 550కోట్లు, బ్ర‌హ్మాస్త్ర 1 కు 375 కోట్ల మేర బ‌డ్జెట్లు పెట్టార‌ని టాక్ ఉంది. వీటిలో 'క‌ల్కి 2898 ఏడి' 800 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేయ‌గా, ఆర్.ఆర్.ఆర్ 1000 కోట్లు కొల్ల‌గొట్టింది. ఆదిపురుష్, బ్ర‌హ్మాస్త్ర చిత్రాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. ఆదిపురుష్ పూర్తిగా డిజాస్ట‌ర్ అవ్వ‌గా, బ్ర‌హ్మాస్త్ర ఓకే అనిపించింది. ఇప్పుడు నితీష్ రామాయ‌ణం -1 కి 835 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారంటే క‌చ్ఛితంగా వ‌సూళ్లు నాలుగింత‌లు వ‌సూలు చేయాలి. క‌ల్కి, ఆర్.ఆర్.ర్ త‌ర‌హాలో ఆరంభ‌మే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే రామాయ‌ణం క‌చ్ఛితంగా విజ‌యం సాధిస్తుంది. 'రామాయ‌ణం' తొలి గ్లింప్స్ ని రేపు (బుధ‌వారం) రిలీజ్ చేసేందుకు చిత్ర‌బృందం సిద్ధ‌మ‌వుతోంది. టీజ‌ర్ తోనే చాలా వర‌కూ ఈ సినిమా నాణ్య‌త ఏ స్థాయిలో ఉందో క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఈ సినిమా కోసం వేలాది వీఎఫ్ ఎక్స్ షాట్స్ తెర‌కెక్కిస్తార‌ని కూడా తెలుస్తోంది. 2026 దీపావ‌ళికి రామాయణం పార్ట్ 1 విడుద‌లవుతుంది. 800 కోట్ల బ‌డ్జెట్ నుంచి 1000 కోట్ల బ‌డ్జెట్ కి మార‌డానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. ఇదంతా ఈ ద‌శాబ్ధ కాలంలో మార్పు. రాబోవు ద‌శాబ్ధంలో నేరుగా ఇండియన్ సినిమా మారో హాలీవుడ్ లా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు.