Begin typing your search above and press return to search.

హాలీవుడ్‌లో రీమేక్ అయిన భార‌తీయ సినిమాలు

పంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అలాంటి 5 బాలీవుడ్ సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే..

By:  Tupaki Desk   |   1 Aug 2023 12:30 AM GMT
హాలీవుడ్‌లో రీమేక్ అయిన భార‌తీయ సినిమాలు
X

హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రాంతీయ భాషా చిత్రాలెన్నో తెర‌కెక్కాయి. ముఖ్యంగా భార‌త‌దేశంలో చాలా బ్లాక్ బ‌స్ట‌ర్ల‌కు హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి ఉంది. ముఖ్యంగా హిందీ ప‌రిశ్ర‌మ‌లో ఇలాంటి ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. హృతిక్ రోషన్ `బ్యాంగ్ బ్యాంగ్` టామ్ క్రూజ్-నటించిన `నైట్ అండ్ డే` రీమేక్. అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చద్దా` ఫారెస్ట్ గంప్ కి అధికారిక రీమేక్. సల్మాన్ ఖాన్ `భరత్` కూడా కొరియన్ మూవీ `ఓడ్ టు మై ఫాదర్`కి రీమేక్. బాలీవుడ్ లో అన్నీ పొరుగు సినిమాల రీమేక్ లేనా? అని విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్న క్ర‌మంలో కొన్ని హిందీ సినిమాలు హాలీవుడ్‌లో రీమేక్ అయ్యాయ‌న్న‌ది కొంద‌రికే తెలిసిన నిజం. పంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అలాంటి 5 బాలీవుడ్ సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే..

వెడ్నెస్ డే (2008) - ఎ కామ‌న్ మ్యాన్ (2013)

ఆరంభం నుంచి చివరి సన్నివేశం వరకు ప్రేక్షకులను కట్టిపడేసే థ్రిల్లర్‌లలో `వెడ్నెస్ డే` ఒకటి. నసీరుద్దీన్ షా-నటించిన ఈ సినిమా గ్రిప్పింగ్ స్టోరీలైన్ సస్పెన్స్ బిల్డప్ స‌న్నివేశాల‌తో కుర్చీ అంచుపై ఉంచుతుంది. స‌మీక్ష‌కులు వీక్షకుల నుండి ప్రశంసలు పొందిన చిత్ర‌మిది. 2013లో ఈ చిత్రం హాలీవుడ్‌లో `ఎ కామన్ మ్యాన్` పేరుతో రీమేక్ అయింది. దీనికి చంద్రన్ ఋత్నం దర్శకత్వం వహించారు. ఇది మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడు ..ఉత్తమ నటుడు సహా అనేక అవార్డులను కూడా గెలుచుకుంది.

విక్కీ డోనర్ (2012) - డెలివరీ మ్యాన్ (2013)

ఆయుష్మాన్ ఖురానా -యామీ గౌతమ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `విక్కీ డోనర్` విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్షకుల ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. బోల్డ్ కంటెంట్ ప్రత్యేకమైన కథాంశం ఈ సినిమాలో ఉంది. ఇంగ్లీష్ వెర్ష‌న్ `డెలివరీ మ్యాన్‌`లో విన్స్ వాన్, క్రిస్ ప్రాట్, కోబీ స్మల్డర్స్ నటించారు. ఆంగ్ల‌ సినిమాకు మిశ్రమ సమీక్షలు వచ్చాయి.

జబ్ వి మెట్ (2007) - లీప్ ఇయర్ (2010)

ఇంతియాజ్ అలీ రూపొందించిన అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల్లో ఒకటి `జబ్ వి మెట్`. ఇందులో షాహిద్ కపూర్ -కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక అద్భుత‌మైన‌ ప్రేమకథా చిత్రంగా కల్ట్ కేట‌గిరీలో వ‌చ్చిన‌ సినిమా ఇది. 2010లో `లీప్ ఇయర్‌` టైటిల్ తో హాలీవుడ్‌లో రీమేకైంది. లీప్ ఇయర్‌కు ఆనంద్ టక్కర్ దర్శకత్వం వహించారు. అమీ ఆడమ్స్, మాథ్యూ గూడె మరియు ఆడమ్ స్కాట్ నటించారు.

డర్ (1993) - ఫియ‌ర్ (1996)

షారుఖ్ ఖాన్, సన్నీ డియోల్,యు జుహీ చావ్లా నటించిన `డర్` చిత్రం 1993లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ విల‌న్ పాత్రలో క‌నిపించారు. హాలీవుడ్ లోను రీమేకై విజ‌యం సాధించింది. 1996లో `ఫియర్` పేరుతో రూపొందిన ఈ చిత్రానికి జేమ్స్ ఫోలే దర్శకత్వం వహించారు. ఫియర్‌లో మార్క్ వాల్‌బర్గ్, రీస్ విథర్‌స్పూన్, విలియం పీటర్‌సన్ నటించారు.

రంగీలా (1995) - విన్ ఎ డేట్ విత్ టాడ్ హామిల్టన్ (2004)

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన `రంగీలా` చిత్రంలో ఊర్మిళ మటోండ్కర్, అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. గ్రిప్పింగ్ స్టోరి యాక్ష‌న్ తో పాటు ఈ చిత్రం లోని పాటలు ప్రేక్షకులను ఉర్రూత‌లూగించాయి. విన్ ఎ డేట్ విత్ టాడ్ హామిల్టన్ పేరుతో హాలీవుడ్ లో తెర‌కెక్కింది. `రంగీలా`కు సీన్ టు సీన్ రీమేక్ గా రూపొందించారు. ఆంగ్ల రీమేక్‌కు విక్టర్ లెవిన్ దర్శకత్వం వహించారు. కేట్ బోస్‌వర్త్, టోఫర్ గ్రేస్, జోష్ డుహామెల్ నటించారు.