Begin typing your search above and press return to search.

ఇండియన్ సినిమా లేడీ సూపర్ స్టార్స్ పాత ఫోటోలు వైరల్‌

ఇండియన్ సినీ ప్రేక్షకులకు దీపికా పదుకునే, అనుష్క శర్మ, అనుష్క శెట్టిల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

By:  Tupaki Desk   |   19 Jan 2024 10:34 AM GMT
ఇండియన్ సినిమా లేడీ సూపర్ స్టార్స్ పాత ఫోటోలు వైరల్‌
X

ఇండియన్ సినీ ప్రేక్షకులకు దీపికా పదుకునే, అనుష్క శర్మ, అనుష్క శెట్టిల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరు ముగ్గురు కూడా హిందీ తో పాటు సౌత్‌ సినీ ప్రేక్షకుల అభిమానంను దక్కించుకున్న విషయం తెల్సిందే.

విశేషం ఏంటంటే ఈ ముగ్గురు కూడా బెంగళూరుకు చెందిన వారే. ఇక ఈ ముగ్గురు కూడా వేరు వేరు కాలాల్లో మౌంట్ కార్మెల్‌ కాలేజీలో చదివిన వారే అవ్వడం విశేషం. ఈ ముగ్గురు తమ కాలేజీ లో చదువుకున్న రోజుల్లో తీసుకున్న ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా సదరు కాలేజ్ ఇన్ స్టా పేజీలో షేర్ చేయడం జరిగింది.

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం తీసిన ఫోటోలుగా తెలుస్తోంది. దీపికా పదుకునే చీర కట్టుకుని చాలా సింపుల్ గా పూల బొకే పట్టుకుని ఉంది. ఇక అనుష్క శర్మ కూడా ఏదో చేతిలో పట్టుకుని క్యూట్‌ స్మైల్ తో నిల్చుని ఉంది. ఇక అనుష్క శెట్టి చేతిలో ట్రంపెట్‌ ను కలిగి ఉంది.

ఈ ముగ్గురు ముద్దుగుమ్మల ఫోటోలను మౌంట్ కార్మెల్‌ కాలేజీ వారు షేర్‌ చేయడం తో ఆ పేజీకి ఒక్కసారిగా ఫాలోయింగ్‌ భారీగా పెరిగింది. అంతే కాకుండా వారి ఫోటోలను చాలా మంది షేర్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముగ్గురు ముద్దుగుమ్మలు ఒకే కాలేజీలో చదువుకున్నారు అంటే నమ్మశక్యంగా లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ముగ్గురిలో దీపికా పదుకునే మరియు అనుష్క శర్మ ల వివాహం అయ్యింది. పెళ్లి అయిన వీరిద్దరు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అనుష్క శర్మ మరియు అనుష్క శెట్టిల సినిమాలు గత ఏడాది రాలేదు కానీ, ముందు ముందు మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీపికా పదుకునే పాన్ వరల్డ్ మూవీ కల్కి లో ప్రభాస్ కు జోడిగా నటిస్తున్న విషయం తెల్సిందే.