Begin typing your search above and press return to search.

2024 ఆస్కార్‌కి ముందు భార‌తీయుల మెమ‌రీ లేన్!

ఆస్కార్ 2024కి ముందు అకాడమీ అవార్డుల చరిత్రలో భారతీయులకు గర్వకారణమైన క్షణాలను స్మ‌రించుకోవాలి

By:  Tupaki Desk   |   11 Feb 2024 6:49 AM GMT
2024 ఆస్కార్‌కి ముందు భార‌తీయుల మెమ‌రీ లేన్!
X

ఆస్కార్ 2024కి ముందు అకాడమీ అవార్డుల చరిత్రలో భారతీయులకు గర్వకారణమైన క్షణాలను స్మ‌రించుకోవాలి. సంవత్సరాలుగా భారతదేశం నుండి చాలా మంది ప్రతిభావంతులైన పాపుల‌ర్ ఆస్కార్ వేదికపై ప్రత్యేక క్షణాలను ఆనందించారు. ఆస్కార్ 2024 సమీపిస్తోంది.. దురదృష్టవశాత్తూ భారతీయులు ఈసారి ఈ వేదిక‌పై ఉండరు. అయితే ఆస్కార్స్ కి ముందు గ‌త వైభ‌వాన్ని ఒక‌సారి గుర్తుకు తెచ్చుకోవాలి.

1983లో సత్యజిత్ రే అకాడమీ అవార్డ్స్‌లో నామినేషన్ అందుకున్న మొదటి భారతీయ ఫిలింమేక‌ర్ గా చరిత్ర సృష్టించారు. లెజెండ‌రీ దర్శ‌కుడు తెర‌కెక్కించిన‌ చిత్రం 'ది హోమ్ అండ్ ది వరల్డ్' ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా నామినేట్ అయింది. ఇది ఆస్కార్స్‌లో భారతీయ ద‌ర్శ‌క‌నిర్మాతల భవిష్యత్తు గుర్తింపుకు మార్గం సుగమం చేసింది. స‌త్య‌జిత్ రే పుర‌స్కారాన్ని గెలవనప్పటికీ, అతని నామినేషన్ ఆస్కార్స్‌లో భారతీయ సినిమా చరిత్రలో ఒక మలుపున‌కు కార‌ణ‌మైంది. ఇది ఒక చ‌రిత్ర‌కు ఆద్యం అయింది.

భారతీయులు ఆస్కార్ వేదిక‌పై అవార్డులను అందించినప్పుడు అది గ‌ర్వించ‌ద‌గిన క్ష‌ణంగా మారింది.

2023 ఆస్కార్ వేదిక‌పై దీపిక ప్ర‌త్య‌క్ష‌మవ్వ‌డం ఒక ముఖ్యమైన ఘట్టం. దీపిక‌ మొదటిసారి ఆస్కార్ రెడ్ కార్పెట్‌పైకి అడుగుపెట్టింది. ఒక అవార్డును అందజేసి, ఈ గౌరవాన్ని సాధించిన మూడవ భారతీయ నటిగా అవతరించింది. అంత‌కుముందే ప్రియాంక చోప్రా 2016లో 88వ అకాడమీ అవార్డ్స్‌లో ప్రెజెంట్ చేసే గౌరవాన్ని పొందింది. 21వ శతాబ్దపు ఆసియా క్రాస్ఓవర్ స్టార్‌గా తన అంతర్జాతీయ ఉనికిని ప్రదర్శించింది. 1980లో అకాడమీ అవార్డ్స్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ మొదటి భారతీయురాలిగా పెర్సిస్ ఖంబట్టా చరిత్ర సృష్టించింది. స్టార్ ట్రెక్: ది మోషన్ పిక్చర్ లో ఆమె పాత్రలను ప్రేమగా గుర్తు చేసుకున్నారు.

2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ ఉత్తమ చిత్రం సహా ఎనిమిది అవార్డులను సాధించింది. దర్శకుడు డానీ బాయిలే స‌హా భార‌తీయ‌ తారాగణం వేదికపై సెల‌బ్రేష‌న్ జరుపుకున్నారు. భారతదేశానికి అరుదైన గ‌ర్వించ‌ద‌గిన క్ష‌ణం అది. ప్రపంచ వేదికపై భారతీయ సినిమా ప్రభావానికి గుర్తింపుగా దీనిని భావించారు.

రెండు ఆస్కార్‌లు సాధించిన తర్వాత A. R. రెహమాన్ తన ప్రసంగం చేసినప్పుడు

''నా జీవితమంతా, నేను ద్వేషం లేదా ప్రేమ ఏదో ఒక‌టి ఎంపిక చేసుకోవాల్సి వ‌స్తే.. నేను ప్రేమను ఎంచుకున్నాను. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. దేవుని ఆశీస్సులు అందాయి'' అని అన్నాడు. 2009లో A. R. రెహమాన్ స్లమ్‌డాగ్ మిలియనీర్ కోసం ఒకే రాత్రిలో రెండు ఆస్కార్‌లను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ .. ఉత్తమ ఒరిజినల్ పాట విభాగాల్లో ఆస్కార్ లు అందుకున్నాడు. భారతదేశంలోని ముంబై మురికివాడల పిల్లలు రుబీనా అలీ , అజారుద్దీన్ ఇస్మాయిల్ స్లమ్‌డాగ్ మిలియనీర్ విజయం తర్వాత ఆస్కార్‌లకు హాజరయ్యారు. తాత్కాలిక గృహాల నుండి అబ్బురపరిచే ఆస్కార్ వేడుక వరకు వారి ప్రయాణం ఉత్కంఠ క‌లిగించింది.

గ‌త ఏడాది ఆస్కార్ ఉత్స‌వాల్లో టాలీవుడ్ మ‌ర‌పురాని క్ష‌ణాల‌ను సొంతం చేసుకుంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి రూపొందించిన ఆర్.ఆర్.ఆర్ ఒరిజిన‌ల్ మ్యూజిక్ కేట‌గిరీలో ఆస్కార్ ను గెలుచుకుని సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేట‌గిరీలో తొలి భార‌తీయ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ చ‌రిత్ర సృష్టించింది. రాజ‌మౌళి- కీర‌వాణి-చంద్ర‌బోస్-రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ వంటి వారికి ఆస్కార్ వేదిక‌గా గొప్ప గుర్తింపు గౌర‌వం ద‌క్కాయి. మునుముందు భార‌తీయ సినీప‌రిశ్ర‌మ ముఖ్యంగా టాలీవుడ్ ఇలాంటి విజ‌యాల్ని మ‌రిన్ని సెల‌బ్రేట్ చేసుకుంటుంద‌ని భ‌రోసా ల‌భించింది.

ఇవ‌న్నీ భార‌తీయుల‌కు అరుదైన క్ష‌ణాలు. ఆస్కార్ ల‌లో భారతీయ ప్రతిభావంతుల గణనీయమైన ప్ర‌భావం గురించి మాట్లాడాల్సి వ‌స్తే ఇవ‌న్నీ గుర్తించాలి. మన కళాకారులు మరోసారి ప్రపంచ వేదికను అలంకరించే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూద్దాం.