Begin typing your search above and press return to search.

ఇండియన్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్.. టాప్ 5లో మనదే హవా

భాషాతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉంటే మాత్రం సినిమాలు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   15 July 2023 10:06 AM GMT
ఇండియన్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్.. టాప్ 5లో మనదే హవా
X

ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలం లో ఇండియన్ సినిమాల కు మంచి డిమాండ్ అయితే పెరిగింది. ముఖ్యంగా మన తెలుగు సినిమాల కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ అయితే దక్కుతోంది. భాషాతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉంటే మాత్రం సినిమాలు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయి లో బాక్సాఫీస్ క్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్ 5 ఇండియన్ సినిమాల లిస్టు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ముందుగా మొదటి స్థానం లో అయితే దంగల్ సినిమానే కొనసాగుతోంది. ఈ సినిమా మొదట 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇక తర్వాత చైనా లో అలాగే మిగతా కొన్ని దేశాల లో విడుదలైన తరువాత మరో వెయ్యి కోట్లను సొంతం చేసుకుంది మొత్తంగా. 2000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని అత్యధిక స్థాయి లో కలెక్షన్స్ అందుకున్న టాప్ ఇండియన్ సినిమాగా నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతోంది.

ఇక రెండవ స్థానం లో బాహుబలి 2 సినిమా 1,810 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో కొనసాగుతోంది. ఈ సినిమాకు అసలు మొదట ఈ స్థాయి లో కలెక్షన్స్ వస్తాయి అని ఎవరు అనుకోలేదు. కానీ సినిమా మిగతా దేశాల్లో కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఫస్ట్ పార్ట్ తో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకున్న దశకుడు రాజమౌళి ఆ తర్వాత బాహుబలి సెకండ్ పార్ట్ తో అంతకుమించి అనేలా సక్సెస్ అందుకున్నాడు.

ఇక అదే క్రేజ్ RRR సినిమా కు కూడా ఉపయోగపడింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1,316 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుని.. మూడవ స్థానం లో అయితే కొనసాగుతోంది. ఈ టాప్ రికార్డుల లిస్టు లో రెండు తెలుగు సినిమాలు ఉండడం విశేషం. అందులోనూ ఆ రెండు సినిమాలు రాజమౌళి సినిమాలే కావడం విశేషం.

ఇక కెజిఫ్ చాప్టర్ 2 కూడా ఏ స్థాయి లో కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కన్నడ సినిమా కు ప్రపంచవ్యాప్తంగా 1,250 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ ఏడాది వచ్చిన పటాన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ కు మంచి బూస్ట్ అయితే ఇచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1,050 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. మొత్తానికి ఈ లిస్టులో 5వ స్థానం లో నిలిచింది. ఇక ఈ ఏడాది మరికొన్ని బిగ్గెస్ట్ సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ఏ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.