Begin typing your search above and press return to search.

ఇండియన్ 3.. శంకర్ మరో షాకింగ్ ట్విస్ట్!

చిత్ర నిర్మాతలు కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేసే ఆలోచనను తీసుకువచ్చారు.

By:  Tupaki Desk   |   26 July 2023 7:34 PM GMT
ఇండియన్ 3.. శంకర్ మరో షాకింగ్ ట్విస్ట్!
X

కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో ఇండియన్ 2 సినిమా మొదలైనప్పుడే అంచనాలు భారీ స్థాయి లో పెరిగిపోయాయి. అయితే ఎలాంటి దిష్టి తగిలిందో కానీ సినిమా షూటింగ్ కొనసాగుతున్న కొద్ది అనేక రకాల మలుపులు తిరిగింది. ఊహించని ప్రమాదం జరగడంతో పాటు దర్శకుడికి నిర్మాతల కు మధ్య చాలా విభేదాలు వచ్చాయి.

బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరిగిపోయింది అని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్ తో గొడవ కూడా పడింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్లడంతో హీరో కమల్ హాసన్ మల్లి ఇద్దరినీ చర్చల కు పిలిచే మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా గొడవ చాలా దూరం వెళ్ళింది. ఇక తర్వాత కోర్టులో కొనసాగిన ఈ కేసు కూడా అనేక చర్చల కు దారి తీసింది.

కమల్ హాసన్ మరోసారి చర్చల కు పిలిచి సక్సెస్ అయ్యేలా చేశాడు. సినిమా షూటింగ్ అయితే మొత్తానికి సెట్స్ పైకి వచ్చింది. మరోవైపు శంకర్ గేమ్ చెంజర్ సినిమా ను డైరెక్ట్ చేస్తూనే ఖాళీ సమయాల్లో ఇండియన్ 2 సినిమా షూటింగ్ ను కూడా కొనసాగించాడు. ఇక ఇప్పుడు మరొక ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నారు అని సోషల్ మీడియా లో టాక్ వైరల్ గా మారుతుంది.

ఈ సినిమా కు మరో పార్ట్ కూడా ఉండబోతుందట. అందుకు కారణం కూడా ఉంది. ఇండియన్ 2 సినిమా నిడివి ఎక్కువగా వచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు 70% షూటింగ్ కూడా ఫినిష్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు దర్శకుడు దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలి అని ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. దర్శకుడు శంకర్ అసలైతే రెండు భాగాలుగా ఈ సినిమా ని చేయాల ని అనుకోలేదు.

కానీ మొదట మూడు గంటల లోపు అనుకున్నప్పటికీ ఆ లెక్క దాటిపోయింది. దాదాపు 5 గంటల నుంచి 6 గంటల నిడివి వస్తూ ఉండడంతో చిత్ర నిర్మాతలు కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేసే ఆలోచనను తీసుకువచ్చారు. అంటే ఇండియన్ 3 కూడా రాబోతోందన్న మాట.

ఇక ఇప్పుడు ఇండియన్ 2 భాగానికి సంబంధించిన షూటింగ్ అయితే చాలా వరకు ఫినిష్ అయింది. ఇండియన్ 2 సినిమాను వచ్చే సమ్మర్ కు విడుదల చేయాలని ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఇక మరోవైపు గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ అయితే ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా వచ్చే ఏడాది రానుంది. ఇక ఇండియన్ 3 మాత్రం 2025 లో రానుంది.