Begin typing your search above and press return to search.

ఇండియన్‌ 3 ఉంది, కానీ కొత్తది కాదు!

తమిళంలో రూపొంది తెలుగు మరియు హిందీ తో పాటు ఇతర భాషల్లో కూడా భారతీయుడు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   9 Nov 2023 11:30 AM GMT
ఇండియన్‌ 3 ఉంది, కానీ కొత్తది కాదు!
X

కమల్‌ హాసన్‌, శంకర్ కాంబినేషన్‌ లో దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన చిత్రం భారతీయుడు. తమిళంలో రూపొంది తెలుగు మరియు హిందీ తో పాటు ఇతర భాషల్లో కూడా భారతీయుడు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇన్ని సంవత్సరాల తర్వాత వీరి కాంబోలోనే ఇండియన్ 2 రాబోతుంది.

గతంలో వచ్చిన సినిమాకు కొనసాగింపు అన్నట్లుగా ఉండకుండా, సేనాపతి పాత్రను తీసుకుని ఆ పాత్ర చుట్టూ కథ అల్లినట్టు సమాచారం అందుతోంది. అవినీతి నిర్మూలనకు సేనాపతి మళ్లీ వస్తే ఎలా ఉంటుంది అన్నట్లుగా ఇండియన్ 2 లో చూపించబోతున్నారు. గత కొన్ని రోజులుగా ఇండియన్‌ 3 ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇండియన్‌ 2 మాదిరిగా కొత్త కథతో కాకుండా ఇండియన్ 3 రెండో భాగం కు కొనసాగింపు అన్నట్లుగా ఉండబోతుంది. అంటే బాహుబలి, కేజీఎఫ్‌ లు ఎలా అయితే ఒకే కథ ను రెండు భాగాలుగా విడుదల చేయడం జరిగిందో ఇండియన్ మూవీని కూడా రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శకుడు శంకర్‌ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఈ విషయాన్ని ఇండియన్ 2 నిర్మాణ భాగస్వామి అయిన ఉదయనిధి స్టాలిన్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కథ పరిధి చాలా పెద్దది. అందుకే ఈ సినిమాను సింగిల్ పార్ట్‌ లో కంటే రెండు భాగాలుగా విడుదల చేస్తే న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశ్యంతో రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు ఆయన ప్రకటించాడు.

సినిమా రెండు భాగాలు అనుకున్న తర్వాత కమల్‌ హాసన్‌ అదనంగా 40 రోజుల పాటు డేట్లు ఇచ్చేందుకు కూడా ఓకే చెప్పాడట. మొత్తానికి ఈ మధ్య కాలంలో చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ ఫాలో అవుతున్న రెండు పార్ట్‌ ల ఫార్ములను దర్శకుడు శంకర్‌ కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి ఆయనకు ఈ ఫార్ములా ఎంత వరకు సక్సెస్ తెచ్చి పెడుతుందో చూడాలి.