Begin typing your search above and press return to search.

ఇండియన్ 2 డిసెంబర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది..!

డిసెంబర్‌ ముగింపు దశకు వచ్చిన ఈ సమయంలో ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ పై మరోసారి యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 11:30 AM GMT
ఇండియన్ 2 డిసెంబర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది..!
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా పై అంచనాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున్న ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కడి వరకు వచ్చింది.. ఏం జరుగుతుంది అనే విషయాలను తమిళ మీడియా వర్గాలకు ఎప్పటికప్పుడు యూనిట్‌ సభ్యులు తెలియజేస్తూనే ఉన్నారు.

డిసెంబర్‌ ముగింపు దశకు వచ్చిన ఈ సమయంలో ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ పై మరోసారి యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. రెండు పాటలు మినహా టాకీ పార్ట్‌ మరియు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యిందని వారి నుంచి అనధికారిక క్లారిటీ వచ్చింది.

శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 కారణంగా రామ్‌ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ విడుదల విషయంలో ఆలస్యం జరుగుతోంది. ఎప్పుడెప్పుడు ఇండియన్ 2 పూర్తి అవుతోందో... ఎప్పుడు గేమ్‌ చేంజర్ పై దర్శకుడు శంకర్‌ పూర్తి ఫోకస్ పెడుతాడో అన్నట్లుగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇండియన్‌ 2 సినిమా చాలా ఏళ్ల క్రితం ప్రారంభించిన విషయం తెల్సిందే. అయితే నిర్మాన సంస్థతో దర్శకుడు శంకర్‌ విభేదాలు, ఇంకా యాక్సిడెంట్స్ వరుస కారణాల వల్ల ఆగిపోయింది. సినిమా ఇక లేనట్లే అనుకుంటూ ఉండగా మధ్యవర్తుల కారణంగా సినిమా మళ్లీ ప్రారంభం అయ్యింది. 2024 సమ్మర్‌ కి సినిమా విడుదల అయ్యే విధంగా శంకర్ ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.