Begin typing your search above and press return to search.

ఇండియన్-2.. మళ్ళీ ఇదెక్కడి ట్విస్టు సామీ?

అయితే త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   8 March 2024 12:30 PM GMT
ఇండియన్-2.. మళ్ళీ ఇదెక్కడి ట్విస్టు సామీ?
X

విలక్షణ నటుడు కమల్ హాసన్, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ ఇండియన్-2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 27 ఏళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ అయిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా రూపొందుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా.. ఇంతవరకు పూర్తి కాలేదు. అయితే త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

1996 మే9వ తేదీన భారతీయుడు మూవీ రిలీజైంది. ఇప్పుడు అదే రోజు సీక్వెల్ కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ.. అదే డేట్ ను షెడ్యూల్ చేసుకుంది. కల్కి సినిమాలో కమల్ హాసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో ఇండియన్-2.. 2024 లాస్ట్ లో రిలీజ్ అవ్వనున్నట్లు టాక్ వినిపించింది.

అయితే భారతీయుడు-2 షూటింగ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉందట. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారట మేకర్స్. మే9 వ తేదీనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇదే నిజమైతే ఒకేరోజు.. కమల్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయన్న మాట. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇండియన్-2 విడుదలకు రంగం సిద్ధం చేశారట మేకర్స్.

భారతీయుడు-2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా 2018లోనే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్‌ ప్రీత్‌ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్.. ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇక ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ఇటీవల అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇండియన్-2 రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి దక్కించుకుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం రూ.75 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. మరి ఏషియన్‌ సురేష్‌ ఎంతకు దక్కించుకున్నారనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ పై మేకర్స్.. అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తారో చూడాలి.