Begin typing your search above and press return to search.

ఇండియన్ 2 న్యూ టార్గెట్.. వచ్చేది అప్పుడేనా?

ఈ రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఇండియన్ 2 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కమల్ హాసన్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Feb 2024 5:51 AM GMT
ఇండియన్ 2 న్యూ టార్గెట్.. వచ్చేది అప్పుడేనా?
X

కమల్ హాసన్ లీడ్ రోల్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఇండియన్ 2. ఇండియన్ కి సీక్వెల్ గా ఈ చిత్రం సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఈ మూవీ ఉంది. శంకర్ ఓ వైపు ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తూనే మరో వైపు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.

ఈ రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఇండియన్ 2 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కమల్ హాసన్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకి శంకర్ నుంచి మూవీ రిలీజ్ పై ఒక స్పష్టత రాబోతున్నట్లు తెలుస్తోంది. మే నెలలో ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందంట.

ఈ మూవీలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ధ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నారు. సిద్ధార్ధ్ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడంట. అయితే ఈ సినిమాలో సేనాపతి పాత్రలో మాత్రమే కమల్ హాసన్ కనిపించబోతున్నారు. ఇండియన్ తరహాలోనే ఈ చిత్రంలో కూడా అవినీతి మీద పోరాటం చేసే వాడిగా కమల్ హాసన్ పాత్రని శంకర్ డిజైన్ చేశారు.

ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకి వచ్చేస్తూ ఉండటంతో శంకర్ రిలీజ్ పై ఫోకస్ చేస్తున్నాడంట. ఇండియన్ 2 మూవీ ఈ వేసవిలో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మగా మారే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. శంకర్ చివరిగా రోబో 2.ఓ మూవీతో 2018లో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మరల ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఇండియన్ 2తో రాబోతున్నారు.

రోబో 2.ఓ మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్ మూవీగా ఇప్పటికి నిలిచి ఉంది. ఇండియన్ 2 చిత్రంతో శంకర్ ఆ రికార్డుని బ్రేక్ చేస్తాడేమో చూడాలి. విక్రమ్ తర్వాత ఇండియన్ 2తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని కమల్ హాసన్ చూస్తున్నారు. మరి వారికి ఎలాంటి రిజల్ట్ ని ఈ చిత్రం ఇస్తుందనేది చూడాలి.