Begin typing your search above and press return to search.

భారతీయుడు-2.. కల్కి వల్లే అంతా!

అయితే ఈ మూవీ జూన్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.

By:  Tupaki Desk   |   5 May 2024 6:01 AM GMT
భారతీయుడు-2.. కల్కి వల్లే అంతా!
X

విలక్షణ నటుడు కమల్ హాసన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు-2. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సీక్వెల్ లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అయితే ఈ మూవీ జూన్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.

కానీ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా జూన్ 13వ తేదీన విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా జూన్ లో రిలీజ్ అవ్వడం కష్టమేనని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. జులైలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పోస్ట్ పోన్ కు గల కారణాలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

వాస్తవానికి.. భారతీయుడు-2ను జూన్ లో రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్.. ఇప్పటి వరకు ప్రమోషన్లు మాత్రం మొదలుపెట్టలేదు. అప్పుడే చాలా మందికి డౌట్ వచ్చింది. ఇంతలో మళ్లీ వాయిదా అని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్.. గేమ్ ఛేంజర్ ను పూర్తి చేయడంలో బిజీగా ఉండటం వల్ల భారతీయుడు-2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమా రిలీజ్ ను మేకర్స్ వాయిదా వేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.

మరికొందరు మాత్రం ప్రభాస్ కల్కి వల్లే భారతీయుడు-2ను పోస్ట్ పోన్ చేస్తున్నారని అంటున్నారు. కల్కి మూవీని జూన్ 27వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ రీసెంట్ గా ప్రకటించారు. ఇక జులై 13న భారతీయుడు-2 విడుదల చేస్తారని టాక్ వచ్చింది. అంటే ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్ రెండు వారాలే. కల్కి లో కూడా కమల్ నటిస్తుండడంతో ఇలా కరెక్ట్ కాదని చాలా మంది బయ్యర్లు మేకర్స్ కు సజ్జెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ కల్కి మూవీపై భారీ హైప్ ఉంది. దీంతో ఎక్కువ థియేటర్లు ఆ సినిమాకే వెళ్తాయి. దీంతో భారతీయుడు-2 మూవీకి స్క్రీన్లు భారీగా దొరకడం కష్టం. అలా అనేక విధాలుగా ఆలోచించాకే రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కల్కికి వచ్చిన రెస్పాన్స్ బట్టి రిలీజ్ చేద్దామని కూడా మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఒకవేళ జులై మిస్ అయితే.. డిసెంబర్ వరకు ఈ సినిమా రిలీజ్ కు డేట్స్ ఖాళీ లేనట్లే. మరేం జరుగుతుందో చూడాలి.