Begin typing your search above and press return to search.

ఇండియన్-2 సేఫ్ గేమ్

తాజాగా మేకర్స్ తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా కొత్త లుక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   14 April 2024 10:31 AM GMT
ఇండియన్-2 సేఫ్ గేమ్
X

పాన్ ఇండియా మార్కెట్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లలో ఇండియన్-2 ఒకటి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లీడ్ రోల్ ను విలక్షణ నటుడు కమల్ హాసన్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మేకర్స్ రిలీజ్ చేసిన ఇండియన్-2 గ్లింప్స్.. పరవాలేదు అనిపించింది కానీ అనుకున్నంత స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.


తాజాగా మేకర్స్ తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా కొత్త లుక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో కమల్.. సేనాపతిగా డ్యుయెల్ షేడ్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఈ సినిమాను జూన్ లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని ఓ ఇంటర్వ్యూతో కమల్ హాసన్ తెలిపారు.


అయితే ఇండియన్-2 మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. జూన్ 13వ తేేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. జూన్ 13 గురువారం.. కాబట్టి ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని సినీ పండితులు చెబుతున్నారు. అప్పటికి ఎన్నికలు, ఐపీఎల్ కూడా పూర్తవుతాయి. మూవీపై పాజిటివ్ టాక్ వస్తే చాలు.. బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని అంటున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఇండియన్-2 సినిమాలో స్టార్ యాక్టర్లు ఎస్‌ జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌, స‌ముద్ర ఖని, బ్రహ్మానందం, మధు బాల, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఉద‌య‌నిధి స్టాలిన్‌- సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఇండియన్ 2 మూవీకి ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు వచ్చాయి. ఓ ఇన్సిడెంట్ లో క్రూ మెంబర్స్ మరణించారు. దీంతో వెంటనే మూవీ షూట్ ను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత కమల్ హాసన్ విక్రమ్, శంకర్ గేమ్ ఛేంజర్ వర్క్స్ లో బిజీ అయ్యారు. విక్రమ్ తర్వాత మళ్లీ ఇండియన్-2ను స్టార్ట్ చేశారు శంకర్. ఇప్పుడు ఇండియన్-3 షూట్ కూడా పూర్తి అయినట్లు కమల్ చెప్పి షాకిచ్చారు. మరి ఇండియన్-2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.