Begin typing your search above and press return to search.

'ఇండియ‌న్-2' ఫిక్స్ చేసారా?

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో 'ఇండియాన్ -2' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Jan 2024 5:30 PM GMT
ఇండియ‌న్-2 ఫిక్స్ చేసారా?
X

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో 'ఇండియాన్ -2' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో పాటు గా శంక‌ర్ 'గేమ్ ఛేంజ‌ర్' షూటింగ్ కూడా సైమ‌ల్టేనియ‌స్ గా పూర్తిచేసే ప‌నిలో ఉన్నారు. ఏడాది కాలంగా శంక‌ర్ రెండు సినిమా ప‌నుల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. చైన్నై టూ హైద‌రాబాద్ రౌండ్లు వేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇంత‌వ‌ర‌కూ ఇలా ఒకేసారి రెండు సినిమాలు చేసింది కూడా లేదు.

దీంతో ఆయ‌నకు శ్ర‌మ కూడా ఎక్కువ‌గానే ప‌డింది. అయితే ఎట్ట‌కేల‌కు ఇండియ‌న్ -2 షూటింగ్ పూర్త‌యింది. చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్లు చిత్ర స‌న్నిహిత వ‌ర్గాలు సోష‌ల్ మీడియాలో తెలిపాయి. ప్ర‌స్తుతం నిర్మాణానంతర ప‌నులు కూడా వేగంగానే జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. అన్ని ప‌నులు పూర్తి చేసి చిత్రాన్ని వేసవి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిసింది.

ఇంత‌వ‌ర‌కూ ఈ సినిమా రిలీజ్ తేదీ ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు. చాలా కాలంగా సినిమా సెట్స్ లో నే ఉండ‌టంతో సినిమా గురించి అప్ డేట్స్ తెలియ‌లేదు. ఏ ద‌శ‌లోనూ ఏక‌ధాటిగా షూటింగ్ నిర్వ‌హించింది లేదు. మ‌ధ్య‌లో కొన్ని ర‌కాల అవాంత‌రాలు ఎదుర‌వ్వ‌డంతో షూటింగ్ అగిపోవ‌డం...న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఇలా అన్ని ఇండియ‌న్ -2ని అన్ని ర‌కాలుగా వెన‌క్కి లాగిపెట్టాయి.

ఎలాగూ ఎట్టేకుల‌కు అన్ని తొల‌గిపోయి చివ‌రికి షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. దీంతో శంక‌ర్ రిలాక్స్ అయిపోతారు. ఇక‌పై పూర్తిగా 'గేమ్ ఛేంజ‌ర్' షూటింగ్ లోనే బిజీ అవుతారు. ఆ సినిమా కూడా 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. బ్యాలెన్స్ కూడా మ‌రో నెల రోజుల్లో పూర్తి చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.