Begin typing your search above and press return to search.

కొత్త భారతీయుడికి 'ఎమర్జెన్సీ' ఎఫెక్ట్..?

ఎమర్జెన్సీ మరియు చందు ఛాంపియన్‌ లను దాటి హిందీలో ఇండియన్ 2 బజ్ క్రియేట్‌ చేయగలదా... ఆ రెండు సినిమాలను దాటుకుని ప్రేక్షకులు ఇండియన్‌ 2 కి వస్తారా అంటే కాస్త అనుమానమే.

By:  Tupaki Desk   |   16 April 2024 8:32 AM GMT
కొత్త భారతీయుడికి ఎమర్జెన్సీ ఎఫెక్ట్..?
X

యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్‌ 2 రాబోతుంది అంటూ ప్రకటన వచ్చి ఆరు ఏళ్లు దాటింది. షూటింగ్‌ అయిదు సంవత్సరాల క్రితమే ప్రారంభం అయ్యింది. కానీ ఇప్పటి వరకు సినిమా మాత్రం విడుదల అవ్వలేదు. ఇటీవలే జూన్‌ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు మరో వైపు రామ్‌ చరణ్‌ తో గేమ్‌ చేంజర్ సినిమాను చేస్తున్నాడు. కనుక ఇండియన్ 2 విషయంలో మరింత ఆలస్యం చేయకూడదు అనే ఉద్దేశ్యంతో జూన్‌ రెండో వారం అంటే 14వ తారీకున విడుదల చేయాలని భావిస్తున్నాడట. నిర్మాతలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.

సౌత్‌ లో ఇండియన్‌ 2 కి జూన్ నెలలో విడుదల అయితే పెద్దగా పోటీ ఉండే అవకాశాలు లేవు. కానీ హిందీ లో మాత్రం జూన్ 14న స్టార్‌ హీరోయిన్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైటెమ్‌ మూవీ ఎమర్జెన్సీ విడుదల అవ్వబోతుంది. అదే రోజున బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న చందు ఛాంపియన్ అనే సినిమా కూడా విడుదల అవ్వబోతుంది.

ఎమర్జెన్సీ మరియు చందు ఛాంపియన్‌ లను దాటి హిందీలో ఇండియన్ 2 బజ్ క్రియేట్‌ చేయగలదా... ఆ రెండు సినిమాలను దాటుకుని ప్రేక్షకులు ఇండియన్‌ 2 కి వస్తారా అంటే కాస్త అనుమానమే. సూపర్ హిట్ టాక్‌ వస్తే తప్ప హిందీ ప్రేక్షకులు ఇండియన్ 2 వైపు చూడక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

గతంలో వచ్చిన ఇండియన్‌ మూవీ అక్కడ సూపర్‌ హిట్ కనుక సీక్వెల్‌ పై అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా హిందీ మార్కెట్‌ లో పోటీ లేని సమయంలో విడుదల చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అన్నట్లుగా సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇండియన్ 2 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల చేసి హిట్ టాక్‌ దక్కించుకుని సాలిడ్‌ వసూళ్లు రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్‌ సాధ్యం కాదు. ఎందుకంటే సినిమాకు ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు, టెక్నికల్‌ గా భారీతనంతో రూపొందించారు. కనుక బడ్జెట్‌ అంతకంతకు పెరిగి పోయింది. కనుక ఇండియన్ 2 అన్ని చోట్ల కూడా మంచి వసూళ్లు దక్కించుకోవాల్సి ఉంది. మరి బాలీవుడ్‌ లో ఎమర్జెర్సీ ఎఫెక్ట్‌ ఉంటే వసూళ్ల పై ప్రభావం పడటం ఖాయం.