బూర్జ్ ఖలీఫాలో ప్లాట్లు కొన్నది ఇద్దరే ఇద్దరా!
ప్రపంచంలోనే ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫా. దుబాయ్ వెళ్తే పర్యాటకులు తప్పక వీక్షించే భనవమది. ఇది కేవలం టవర్ మాత్రమే కాదు. ఆకాశ సౌధాన్ని నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దారు.
By: Tupaki Desk | 25 July 2025 9:00 PM ISTప్రపంచంలోనే ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫా. దుబాయ్ వెళ్తే పర్యాటకులు తప్పక వీక్షించే భనవమది. ఇది కేవలం టవర్ మాత్రమే కాదు. ఆకాశ సౌధాన్ని నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అత్యంత విలాస వంతమైన నివాసాలకు నిలయంగా తీర్చిదిద్దారు. లగ్జరీ లైఫ్ స్టైల్ కు చిరునామాగా బూర్జ్ ఖలీఫా ఎంతో ఫేమస్. మరి ఈ టవర్ లో ఎంత మంది సెలబ్రిటీకు సొంత ప్లాట్ లు ఉన్నాయి? అంటే ఇద్దరు పేర్లే తెరపైకి వచ్చాయి. వాళ్లే మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్....బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. వీళ్లిద్దరికి మాత్రమే ఓన్ ప్లాట్స్ ఉన్నాయి.
శిల్పాశెట్టికి ఇందులో ప్లాట్ బహుమతిగా లభించింది. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య పేరిట ఓ లగ్జరీ ప్లాట్ ను కొనుగోలు చేసాడు. దీని విలువ 50 కోట్లకు పైగానే ఉంటుం దని అంచనా. ఈ ప్లాగ్ 19వ అంతస్తులో ఉంది. ఇదే ప్లాట్ ను ఓ విదేశీయుడు కొనాలని అప్పట్లో ట్రై చేసా డు. కానీ అప్పటికే రాజ్ కుంద్రా బుక్ చేయడంతో సొంతమైంది. లేదంటే ఆ విదేశీయుడి పేరిట ఈ ప్లాట్ ఉండేది. అలాగే మోహన్ లాల్ 29వ అంతస్తులో ప్లాట్ కలదు.
దాదాపు 940 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్లాట్ ధర 30 కోట్లు ఉంటుందని అంచనా. మోహన్ లాల్ తన భార్య పేరిట ఇది కొనుగోలు చేసారు. ఇందులో ఉన్న ప్లాట్ లు అన్నీ అత్యంత ఖరీ దైనవే. వీరితో పాటు కేరళకు చెందిన ఓ వ్యాపార వేత్త జార్జ్ నీరయపరంబిల్ కు కూడా ఇందులో సొంత ప్లాట్స్ కలవు. ఆయన ఏకంగా 22 ప్లాట్లు కొన్నారు. శిల్పాశెట్టి... మోహన్ లాల్ కొన్న ప్లాట్స్ అద్దెకు ఇచ్చేసి నెలవారి ఆదాయం పొందుతున్నారు.
అయితే ఇంతటి ప్రతిష్టాత్మక భనవంలో చాలా మంది సెలబ్రిటీలకు ప్లాట్స్ ఉంటాయని భావించినా వారెవరూ ముందుకొచ్చిట్లు లేదు. సెలబ్రిటీలకు సంబంధించి చాలా మందికి విదేశాల్లో రెస్టార్లెంట్లు కలవు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చాలా మంది నటీనటులు విదేశాల్లోనూ చేస్తోన్న సంగతి తెలిసిందే.
