Begin typing your search above and press return to search.

తీవ్ర‌వాదంపై ర‌క్తి క‌ట్టించిన‌ సినిమాలు సిరీస్‌లు

ప‌హ‌ల్గామ్ దాడుల నేప‌థ్యంలో మ‌రోసారి ``టెర్ర‌ర్ వ‌ర్సెస్ సినిమా`` టాపిక్ హైలైట్ గా మారింది. సినిమా హిస్ట‌రీలో కొన్ని విజ‌య‌వంత‌మైన దేశ‌భ‌క్తి నేప‌థ్య‌ సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే..

By:  Tupaki Desk   |   23 April 2025 11:34 PM IST
Patriotism Films And Series In Indian Film Industry
X

దేశ‌భ‌క్తి, తీవ్ర‌వాదం నేప‌థ్యంలో భార‌తీయ సినిమా హిస్ట‌రీలో చాలా సినిమాలు వచ్చాయి. వీటిలో బ్లాక్ బస్ట‌ర్లు ఉన్నాయి. థియేట‌ర్ల‌లో ప్ర‌జ‌ల చేత కంట త‌డి పెట్టించ‌డ‌మే గాక‌, ఎమోష‌న్ ర‌గిల్చిన దేశ‌భ‌క్తి- టెర్ర‌ర్ నేప‌థ్య‌ చిత్రాలు కొన్ని ఉన్నాయి. ప‌హ‌ల్గామ్ దాడుల నేప‌థ్యంలో మ‌రోసారి ``టెర్ర‌ర్ వ‌ర్సెస్ సినిమా`` టాపిక్ హైలైట్ గా మారింది. సినిమా హిస్ట‌రీలో కొన్ని విజ‌య‌వంత‌మైన దేశ‌భ‌క్తి నేప‌థ్య‌ సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే..

*యూరి.. తీవ్ర‌వాదం నేప‌థ్యంలో ఉత్కంఠ రేకెత్తించిన సినిమా ఇది. విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్యధ‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. యూరి సెక్టార్ లో పాక్ ముష్క‌రుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భార‌త‌ సైనికుల‌కు నివాళిగా ప్ర‌తిదాడులు చేసే భార‌తీయ మిల‌ట‌రీ వీరుల క‌థ‌తో ఈ సినిమా ర‌క్తి క‌ట్టించింది. క‌మ‌ర్షియల్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. బాలీవుడ్ లో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా న‌టించిన `షేర్ షా` కార్గిల్ వీరుడు విక్ర‌మ్ బాత్రా క‌థ‌తో తెర‌కెక్కి చ‌క్క‌ని విజ‌యం సాధించింది.

*ఆజాద్ .. నాగార్జున న‌టించిన ఈ సినిమాలో రక్తి క‌ట్టించే స‌న్నివేశాలు ఎన్నో ఉన్నాయి. క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ సాధించ‌క‌పోయినా, ఇందులో కంటెంట్ మెప్పిస్తుంది. మార‌ణ‌హోమం సృష్టించే తీవ్ర‌వాదులు మ‌నుషుల మ‌ధ్య ఎలా దాగుడుమూత‌లాడుతారో ఈ చిత్రంలో ర‌ఘువర‌ణ్ పాత్ర‌లో చూపించారు. నాగార్జున‌, ర‌ఘువ‌ర‌ణ్ పోటీప‌డి న‌టించారు.

*ఖ‌డ్గం.. తీవ్ర‌వాదం నేప‌థ్యంలో కృష్ణ‌వంశీ బ్రాండ్ తో రూపొందిన చిత్ర‌మిది. ఇందులో శ్రీ‌కాంత్, ర‌వితేజ‌, ప్ర‌కాష్ రాజ్ పాత్ర‌లు వేటిక‌వే ప్ర‌త్యేకం. టెర్ర‌రిజం బ్యాక్ డ్రాప్ లో ఎమోష‌న‌ల్ స్టోరీని క్రియేటివ్ డైరెక్ట‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించేలా తెర‌కెక్కించారు.

*గూఢ‌చారి.. అడివి శేష్ న‌టించిన ఈ సినిమా స్పై ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టిస్తుంది. తీవ్ర‌వాదుల్ని ఏరి పారేసే గూఢ‌చారి పాత్ర‌లో శేష్ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.

*మేజ‌ర్: దేశ‌భ‌క్తుడు మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్ర‌మిది. ఇది సాహ‌సికుడు అయిన ఎన్.ఎస్.జి క‌మెండో క‌థాంశంతో ర‌క్తి క‌ట్టిస్తుంది. క‌రుడుగ‌ట్టిన తీవ్ర‌వాదులు ముంబైలో సృష్టించిన మార‌ణ‌హోమం స‌మ‌యంలో ఉన్నికృష్ణ‌న్ విరోచిత పోరాట క‌థ‌ను తెర‌పై చూపించారు. ఎన్.ఎస్.జి క‌మెండో క‌థ‌ను తెర‌పై గగుర్పాటుకు గురి చేసేలా శేష్ బృందం తెర‌కెక్కించారు. క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం, మ‌ణిర‌త్నం రోజా, విజ‌య్ తుపాకీ తీవ్ర‌వాదం నేప‌థ్యంలో క్లాసిక్ సినిమాలుగా హిస్ట‌రీలో నిలిచాయి.

*తీవ్ర వాదం నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించే వెబ్ సిరీస్ లు వచ్చాయి. క‌శ్మీర్ తీవ్ర‌వాదం నేప‌థ్యంలో రాజ్ అండ్ డీకే రూపొందించిన‌ `ది ఫ్యామిలీ మ్యాన్` నిజంగా ఒక సెన్సేష‌న్. రెండు సీజ‌న్లుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప ఆద‌ర‌ణ పొందింది. రెండో సీజ‌న్ లో శ్రీ‌లంక‌కు ఎందిన ఎల్.టి.టి.ఇ ఉగ్ర‌వాదాన్ని తెర‌పై చూపించారు. తీవ్ర‌వాదం నేప‌థ్యంలోనే `స్పెష‌ల్ ఓపిఎస్` ఓటీటీలో గ్రాండ్ స‌క్సెసైంది. ఆర్టిక‌ల్ 360 కూడా క‌శ్మీర్ తీవ్ర‌వాదం నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించింది. తీవ్ర‌వాదం అంతూ ద‌రీ లేనిది. అందుకే టెర్రర్ ఎటాక్స్- దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో మ‌రిన్ని చిత్రాలు భ‌విష్య‌త్ లో రానున్నాయి. ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ ఇలాంటి క‌థ‌ల్ని తెలివిగా ఒడిసిప‌డుతున్నారు.