Begin typing your search above and press return to search.

2025 ఫస్టాఫ్.. బాక్సాఫీస్ వద్ద రూ.5,723 కోట్లు

2025లో చూస్తుండగానే అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. మరో 10 రోజుల్లో ఏడో నెల కూడా కంప్లీట్ అవుతుంది.

By:  Tupaki Desk   |   20 July 2025 12:09 PM IST
2025 ఫస్టాఫ్.. బాక్సాఫీస్ వద్ద రూ.5,723 కోట్లు
X

2025లో చూస్తుండగానే అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. మరో 10 రోజుల్లో ఏడో నెల కూడా కంప్లీట్ అవుతుంది. అయితే మొదటి ఆరు నెలల్లో ఎన్నో సినిమాలు థియేటర్స్ లో సందడి చేశాయి. అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో హిట్స్ గా మాత్రం తక్కువే నిలిచాయని చెప్పాలి.

అయితే 2025 తొలి ఆరు నెలల్లో ఇండియన్ సినిమాలు సాధించిన కలెక్షన్లకు సంబంధించిన రిపోర్టును ప్రముఖ ఓర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసింది. ఇండియా బాక్సాఫీస్‌ రిపోర్ట్‌: జనవరి- జూన్‌ 2025 పేరుతో తీసుకొచ్చింది. అందులో ఈ ఏడాది ఫస్టాఫ్ లో మొత్తం కలెక్షన్లు రూ.5,723 కోట్లుగా వెల్లడించింది.

అలా జనవరి నుంచి జూన్ వరకు భారతీయ సినిమాలన్నీ కలిపి వసూలు చేసిన మొత్తం కలెక్షన్లు రూ.5,723గా తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 14 శాతం పెరిగినట్లు తెలిపింది. 17 చిత్రాలు రూ.100 కోట్లు మార్క్ దాటాయని ప్రకటించింది. అయితే 2025 సెకండాఫ్ లో అనేక చిత్రాలు అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.

వాటిలో భారీ సినిమాలు బోలెడు ఉన్నాయి. అవి హిట్ టాక్ సంపాదించుకుని వసూలు చేస్తే.. ఈ ఏడాది బాక్సాఫీస్ రూ.13,500 కోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో ముగియవచ్చని ఓర్మాక్స్ మీడియా తన నివేదికలో తెలిపింది. ఇదే ఇండియన్‌ థియేటర్‌ మార్కెట్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన సంవత్సరంగా నిలుస్తుందని అంచనా వేసింది.

అయితే 2025లో ఇప్పటి వరకు ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాగా రూ.693 కోట్లతో చావా నిలిచింది. ఛత్రపతి శివాజీ వారసుడు అయిన శంభాజీ మహరాజ్ కథాంశంతో రూపొందించిన మూవీ భారీ విజయం సాధించింది. ఆ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం ఉంది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లతో సూపర్ హిట్ గా నిలిచింది.

ఫస్టాఫ్ లో జూన్ నెలలోనే రూ.900 కోట్లు వచ్చాయి. హిందీ చిత్రాలు సితారే జమీన్ పర్, హౌస్‌ ఫుల్ 5 అత్యధిక వసూళ్లు సాధించాయి. ఒక్కొక్కటి రూ.200 కోట్లకు దగ్గరగా వసూలు చేశాయని ఓర్మాక్స్ తెలిపింది. తమిళ- తెలుగు ద్విభాషా చిత్రం కుబేరా, F1 సహా పలు సినిమాలు కూడా అత్యధిక వసూళ్లు చేసిన వాటిలో ఉన్నాయి. మరి 2025 సెకండాఫ్ లో ఎంతటి వసూళ్లు వస్తాయో వేచి చూడాలి.