రజినీ రాయబారం.. ఇండియన్-3 షూట్‌కు సన్నాహలు
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ మూవీస్‌లో ఒకటనదగ్గ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ అన్నపుడు ప్రేక్షకులు ఎంతగా ఎగ్జైట్ అయ్యారో.
By: Tupaki Desk | 17 July 2025 8:45 AM ISTసౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ మూవీస్‌లో ఒకటనదగ్గ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ అన్నపుడు ప్రేక్షకులు ఎంతగా ఎగ్జైట్ అయ్యారో. కానీ గత ఏడాది విడుదలైన ఈ సినిమా చూశాక.. ఆ కళాఖండాన్ని టచ్ చేయకుండా అలా వదిలేసి ఉంటే ఎంత బావుణ్నో అనుకున్నారంతా. ‘ఇండియన్’ ఎంత గొప్పగా అనిపిస్తుందో.. ‘ఇండియన్-2’ అంత పేలవంగా అనిపించి ప్రేక్షకులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఫలితంగా సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందీ సినిమా.
ఆల్రెడీ తిన్న దెబ్బలు సరిపోవని.. ‘ఇండియన్-2’ ఇచ్చిన షాక్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణమే ఆపేసే పరిస్థితికి వచ్చింది. ఈ స్థితిలో ఆల్రెడీ చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఇండియన్-2’ సంగతి ఏమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ‘ఇండియన్-2’ రిలీజై అప్పుడే ఏడాది పూర్తి కాగా.. ‘ఇండియన్-3’ తిరిగి ఎప్పుడు పట్టాలెక్కుతుందో.. అసలు రిలీజవుతుందో లేదో అని చర్చించుకుంటున్నారు కోలీవుడ్లో.
ఇలాంటి టైంలో ‘ఇండియన్-3’ గురించి అప్‌డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా మళ్లీ సెట్స్ మీదికి వెళ్లనుందట. మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయడానికి షెడ్యూల్స్ వేసేశారట. హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్.. లైకా ప్రొడక్షన్స్‌తో ఒక ఒప్పందానికి వచ్చి ఈ సినిమాను పూర్తి చేయడానికి రెడీ అయ్యారని సమాచారం. ఈ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ రాయబారం నడిపినట్లు సమాచారం. లైకాలో ‘2.0’, ‘లాల్ సలామ్’ చేసిన రజినీకి ఆ సంస్థ అధినేతలతో అనుబంధం ఉంది.
ఆ ప్రొడక్షన్ హౌస్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వారిని మరింత ఇబ్బంది పెట్టకుండా షూట్ పూర్తి చేసేలా రజినీ.. కమల్, శంకర్‌లను ఒప్పించారట. మిగతా చిత్రీకరణకు వీళ్లిద్దరూ పారితోషకాలు కూడా ఏమీ తీసుకోరట. తర్వాతి షెడ్యూల్లో ఒక పాట, కొన్ని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ చేయనున్నారు. సినిమా రెడీ అయ్యాక దీన్ని థియేటర్లలో రిలీజ్ చేయడమా.. లేక నేరుగా ఓటీటీలో వదలడమా అన్నది ఆలోచిస్తారు. ఈ ఏడాది చివరిలోపే ‘ఇండియన్-2’ విడుదలయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం.
