ఇండియన్ -3ని ఆగస్టులో వదులుతున్నారా?
`ఇండియన్ 2` రిలీజ్ అయి సరిగ్గా ఏడాది పూర్తయింది. గత ఏడాది జూలైలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది.
By: Tupaki Desk | 27 Jun 2025 2:00 AM IST`ఇండియన్ 2` రిలీజ్ అయి సరిగ్గా ఏడాది పూర్తయింది. గత ఏడాది జూలైలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. శంకర్ నుంచి ఏదో ఊహిస్తే ఇంకేదో జరిగిపో యింది. అటుపై శంకర్ డైరెక్ట్ చేసిన `గేమ్ ఛేంజర్` కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. దీంతో శంకర్ డైలమా లో పడ్డారు. జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన `ఇండియన్ 3` ఇంత వరకూ రిలీజ్ కాలేదు.
చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి రిలీజ్ చేయడమే..ఆ పని కూడా జనవరి కల్లా పూర్తవుతుందని టీమ్ ప్రకటించింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ `ఇండియన్ 2` వైఫల్యం నేపథ్యంలో `ఇండియన్ 3`ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే వాటిని చిత్ర యూనిట్ ఖండించింది. నేరుగా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
కానీ 2025 ఇప్పటికే ఆరు మాసాలు పూర్తయింది. ఇంత వరకూ మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టులో రిలీజ్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం పురస్క రించుకుని ఆగస్టు 14న రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. దీనికి సంబంధించి శంకర్ కూడా ఆలస్యం చేయోద్దని సూచించారుట. దీంతో నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్- రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఇటీవలే సుభాస్కరన్, ఉదయనిధి, శంకర్ మధ్య రిలీజ్ కు సంబంధించి డిస్కషన్స్ జరిగాయని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రిలీజ్ అంశం తెరపైకి వస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెం తో మేకర్స్ ధృవీకరించాలి.
