Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్లే అయినా హీరోల రేంజ్ వీళ్ల‌ది!

ఈ న‌లుగురు హీరోల రేంజ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Tupaki Desk   |   30 March 2025 2:00 AM IST
డైరెక్ట‌ర్లే అయినా హీరోల రేంజ్ వీళ్ల‌ది!
X

ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్లు ఎవ‌రు? అంటే రాజ‌మౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్ర‌శాంత్ నీల్ పేర్లు టాప్ లో ఉంటాయి. ఈ న‌లుగురు హీరోల రేంజ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. తీసిని సినిమాలు...ఇచ్చిన హిట్లు...బాక్సాఫీస్ లెక్క‌లు అలా ఉన్నాయి మ‌రి. 'బాహుబ‌లి', 'ఆర్ ఆర్ ఆర్' విజ‌యాల‌తో రాజ‌మౌళి 3500 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించిన చిత్రాలు అందించారు.

ఆ సినిమాల‌కు గాను రాజ‌మౌళి వంద‌ల కోట్లు పారితోషికం తీసుకున్నారు. రెమ్యున‌రేష‌న్ మించి లాభాల్లో అధిక మొత్తంలో వాటా కూడా అందుకున్నారు. ఇంకా చెప్పాలంటే అందులో న‌టించిన హీరోల‌కంటే అత్య‌ధిక పారితోషికం అందు కుంది రాజ‌మౌళినే. ఇక 'పుష్ప' ప్రాంచైజీతో సుకుమార్ దేశంలో ఓ బ్రాండ్ అయిపోయారు. 'పుష్ప 2' ఏకంగా 1800 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించ‌డంతో? దేశ‌మంతా సుకుమార్ వైపు చూసింది.

అత‌డితో సినిమాలు చేయాల‌ని బాలీవుడ్ హీరోలంతా క్యూలో ఉన్నారు. 'పుష్ప 2' సినిమాకు గాను సుకుమార్ వంద‌ల కోట్లు అందుకున్నాడు. పారితోషికంతో పాటు ఊహించ‌ని లాభాలు రావ‌డంతో? భారీ మొత్తంలో షేర్ కూడా అందుకున్నాడు. 'పుష్ప 2' కు బ‌న్నీ 300 కోట్ల వ‌ర‌కూ పారితోషికం తీసుకున్న‌ట్లు పోర్బ్స్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. సుకుమార్ కూడా అంత‌కు మించే అందుకుని ఉంటాని అంచ‌నా.

అలాగే సందీప్ రెడ్డి వంగా 'యానిమ‌ల్' తో ఎంత‌టి సంచ‌ల‌నం అయ్యాడో తెలిసిందే. ఈ సినిమా నిర్మా ణంలో సందీప్ కూడా భాగ‌స్వామి. పెట్టుబ‌డి తో పాటు క్రియేటివ్ విభాగంలోనూ ఆయ‌న‌దే కీల‌క పాత్ర‌. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 900 కోట్ల వ‌ర‌కూ వ‌సూళ్లు సాధించింది. అందులో ప్ర‌ధాన వాటా దారుడు సందీప్. త‌దుప‌రి సినిమాలు కూడా సందీప్ ఇదే ప్రాతిప‌దిక‌న చేస్తున్నాడు. 'కేజీఎఫ్' తో ప్ర‌శాంత్ నీల్ కూడా మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

'స‌లార్' విజ‌యంతోనూ ఆ బ్రాండ్ చూపించాడు. కేజీఎఫ్, స‌లార్ విజ‌యాల‌తో 2000 కొట్ల‌కు పై గా వ‌సూళ్లతో స‌త్తా చాటిన ద‌ర్శ‌కుడు. ఈ రెండు సినిమాల‌కు భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నాడు. లాభాల్లో వాటా కూడా అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ తో 'డ్రాగ‌న్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇలా ఈ నలుగురికి పాన్ ఇండియాలో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వాళ్ల‌తో ప‌నిచేయాల‌ని ఇండియాలో ప్ర‌తీ స్టార్ కోరుకుంటున్నాడు. నిర్మాత‌లు కోట్ల రూపాయలు పారితోషికం ఇవ్వ‌డానికి సిద్దంగా ఉన్నారు.