Begin typing your search above and press return to search.

న‌టి పూజ‌లు నెట్టింట దుమారం పెద్ద‌దే!

సెల‌బ్రిటీల ఫేమ‌స్ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆధ్వ‌ర్యంలో కొన్ని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 Jan 2024 8:35 AM GMT
న‌టి పూజ‌లు నెట్టింట దుమారం పెద్ద‌దే!
X

సంచ‌ల‌నాల రాంగోల్ వ‌ర్మ ఇంట‌ర్వ్యూతో వెలుగులోకి వ‌చ్చిన ఇన‌య సుల్తానా గురించి ప‌రిచ‌యం అవ‌సరం లేదు. అటుపై అమ్మ‌డు బిగ్ బాస్ తో మ‌రింత ఫేమ‌స్ అయింది. ఈ క్రేజ్ తో సినిమాల్లో ఛాన్సు లొస్తాయ‌ని ఆశ‌ప‌డింది కానీ అమ్మ‌డి కెరీర్ ఆశించిన విధంగా మాత్రం సాగ‌లేదు. సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. తాజాగా ఈ బ్యూటీ మ‌రోసారి ప్ర‌త్యేక పూజ‌ల‌తో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

సెల‌బ్రిటీల ఫేమ‌స్ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆధ్వ‌ర్యంలో కొన్ని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి న‌ట్లు తెలుస్తోంది. మెడ‌లో పూల మాల‌..వేణు స్వామి క‌ల‌శంతో నీళ్లు చ‌ల్ల‌డం దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో సంచ‌ల‌నానికి దారి తీసింది. ఇది చూసిన నెటి జ‌నులు ముస్లీమ్ యువ‌తి హిందూ పూజ‌లు చేయ‌డం ఏంటి? అని ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై ర‌క‌ర‌కాల కామెంట్లు తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఫేమ‌స్ అవ్వ‌డం కోసం ఇలా హిందూ పూజ‌లు చేస్తుందా? లేక నిజంగా హిందువులంటే గౌర‌వానికి ప్ర‌తీక‌గా చేస్తుందా? ఈ రెండు గాక నిజాయితీగా సినిమా అవ‌కాశాల కోసం ఇలాంటి ప్ర‌య‌త్నాలా? అంటూ ప్ర‌శ్ని స్తున్నారు. వీటికి ఇన‌య‌ స‌మాధానం కూడా అంతే ఘాటుగా ఉంది.' నేను భార‌త దేశంలో ఉన్నాను. ఇక్క‌డ నాకు న‌చ్చింది చేయ‌గ‌లిగే స్వేచ్ఛ ఉంది. మధ్య‌లో మీకేంటి స‌మ‌స్య‌? అని అన్ని విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఇచ్చేసింది.

ప్ర‌స్తుతం ఈ టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సినిమా అవ‌కాశాల కోసం..ఇండ‌స్ట్రీలో కెరీర్ స‌క్ర మంగా ముందుకు సాగ‌డం కోసం ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్లు..న‌టీమ‌ణులు వేణుస్వామితో ప్ర‌త్యేక పూజ‌లు చేయించుకున్న సంగ‌తి తెలిసిందే. అందులో నిధి అగ‌ర్వాల్..స‌మంత కూడా ఒక‌రు. కొంత మందికి ఆయ‌న పూజ‌లు ఫ‌లించిన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఆ పూజ‌ల కార‌ణంగా ఇండ‌స్ట్రీలో బిజీ అయిన‌ట్లు ప్ర‌చారం సాగింది. మ‌రి ఇన‌య పూజ‌లు కూడా ఫ‌లిస్తాయా? అన్న‌ది చూడాలి.