Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రూ పాన్ ఇండియాకు దూరంగా!

అమ్మాయి అబ్బాయి ప్రేమ‌క‌థ‌, రొమాన్స్, కామెడీ నేప‌థ్యంలో చాలా సినిమాలు యువ‌త‌రం ఆద‌ర‌ణ‌తో విజ‌యాలు సాధించాయి. రొమాంటిక్ కామెడీలు ఎన్ని తెర‌కెక్కించినా వాటికి ఆద‌ర‌ణ ఉంటుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 8:15 AM IST
ఆ ఇద్ద‌రూ పాన్ ఇండియాకు దూరంగా!
X

అమ్మాయి అబ్బాయి ప్రేమ‌క‌థ‌, రొమాన్స్, కామెడీ నేప‌థ్యంలో చాలా సినిమాలు యువ‌త‌రం ఆద‌ర‌ణ‌తో విజ‌యాలు సాధించాయి. రొమాంటిక్ కామెడీలు ఎన్ని తెర‌కెక్కించినా వాటికి ఆద‌ర‌ణ ఉంటుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్ర‌తిసారీ ప్ర‌జ‌ల‌కు ఏదో ఒక కొత్త‌ద‌నం కావాలి. క‌డుపుబ్బా న‌వ్వించే, రొమాన్స్ ని ఆహ్లాద‌క‌రంగా ఆస్వాధించేలా క‌థ‌నాన్ని తీర్చిదిద్దాలి. వీటికి తోడు ప్ర‌తి స‌న్నివేశంలో ఎమోష‌న్స్ వ‌ర్క‌వుట్ కావాలి.

అలాంటి క‌థ‌ల్ని రూపొందించ‌డంలో సిద్ధ‌హ‌స్తుడు ఇంతియాజ్ అలీ. అత‌డు ప్ర‌స్తుతం ఓ రొమాంటిక్ కామెడీ క‌థ‌పై వ‌ర్క‌వుట్ చేస్తున్నాడు. ఇందులో వేదంగ్ రైనా, నసీరుద్దీన్ షా, దిల్జిత్ దోసాంజ్ , శార్వరి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ సంవత్సరం ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం వైశాఖి 2026 నాటికి థియేటర్లలోకి రానుంది. మాన‌వ సంబంధాల నేప‌థ్యంలో రూపొందించే ఈ చిత్రం హృద‌యాల‌ను హ‌త్తుకుపోయే స‌న్నివేశాల‌తో ఆక‌ట్టుకోనుంది. అమ్మాయి అబ్బాయి ప్రేమ‌క‌థ‌తో పాటు, కవి మోమిన్ రాసిన కోట్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇంతియాజ్ పేర్కొన్నారు. రాక్‌స్టార్, హైవే , తమాషా తర్వాత రెహ‌మాన్ తో క‌లిసి ప‌ని చేస్తున్నాన‌ని కూడా ఇంతియాజ్ తెలిపారు. ఇది ఒక మ్యూజిక‌ల్ ట్రీట్ అవుతుంద‌ని కూడా హామీ ఇస్తున్నాడు.

మ‌రోవైపు డేవిడ్ ధావ‌న్ ఇంచుమించు ఇలాంటి క‌థ‌తోనే మాస్ అంశాల్ని జోడించి క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ లో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. `హై జవానీ తో ఇష్క్ హోనా హై` కూడా అదే రోజున అంటే వైశాఖి 2026న విడుదలవుతోంది. రెండు చిత్రాలు ఒకే శైలిలో ఉంటాయి.. కానీ డేవిడ్ ధావన్ తన చిత్రంలో మరింత‌గా కామెడీ- మసాలా అంశాలను జోడిస్తాడు. 2020 ల‌వ్ ఆజ్ క‌ల్ ఫెయిల‌య్యాక ఇంతియాజ్ కి ఛాలెంజింగ్ మూవీ ఇది. డేవిడ్ ధావ‌న్ కూడా కూలీ నంబ‌ర్ 1 లాంటి ఫ్లాప్ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా రీఎంట్రీ ఇస్తున్నాడు. డేవిడ్ చిత్రంలో మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టిస్తారు. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ లో మ‌సాలా అంశాల‌తో రూపొందే డేవిడ్ సినిమాతో పోలిస్తే ఇంతియాజ్ మూవీ క‌ల్ట్ జాన‌ర్ లో వ‌స్తుంది. ఈ రెండు సినిమాలు ఫార్మాట్లు వేరు కానీ, క‌థాంశాలు ఒకే విధంగా ఉంటాయ‌ని అంచ‌నా. పాన్ ఇండియా క‌ల్చ‌ర్ కి భిన్నంగా ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు సినిమాల‌ను ప్లాన్ చేస్తుండ‌టం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం.