ఆ స్వభావం వల్లే ఈ స్టార్ హీరో ఇతరుల కంటే భిన్నమైనవాడు!
సినిమాల్లో ఎంతటి అద్భుతమైన నటనను కనబరిచినా.. నిజ జీవితంలో రణ్‌బీర్ చూపించే ఈ డౌన్-టు-ఎర్త్ స్వభావమే అతడిని ఒక విలక్షణమైన నటుడిగా మార్చిందని ఇంతియాజ్ అలీ విశ్లేషించారు.
By: Sivaji Kontham | 17 July 2026 4:20 AM ISTదర్శకుడు ఇంతియాజ్ అలీ - రణ్‌బీర్ కపూర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన రాక్‌స్టార్, తమాషా చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులకు ఒక కల్ట్ క్లాసిక్స్. తాజాగా రణ్‌బీర్ కపూర్ వ్యక్తిత్వం గురించి ఇంతియాజ్ అలీ వ్యక్తపరిచిన అభిప్రాయం ఆసక్తిని రేకెత్తించింది. అతడ ప్రకారం.. ఎంత పెద్ద స్టార్ డమ్ ఉన్నా అతడు పూర్తిగా ఒదిగి ఉంటాడని ఇంతియాజ్ అన్నారు. బహుశా ఈ క్వాలిటీనే అతడిని ఇతర హీరోల కంటే భిన్నంగా మలిచిందని అన్నారు. అంత పెద్ద స్టార్ డమ్ ఉన్న ఏ నటుడు అయినా తమ ప్రత్యేకతను చూపించుకోవడానికి ఆరాటపడతారని, కానీ రణబీర్ అసలు ఏదీ పట్టించుకోడని తెలిపారు.
ఇంతియాజ్ ప్రకారం.. రణ్‌బీర్ కపూర్ వ్యక్తిత్వం చాలా సింపుల్ గా ఉంటుంది. ఒదిగి ఉంటాడు.. బహుశా అదే అతడిని పరిశ్రమలో అందరి కంటే భిన్నంగా నిలబెట్టే క్వాలిటీ ఇదేనని ఇంతియాజ్ అలీ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా అంతటి క్రేజ్, స్టార్‌డమ్ ఉన్నా.. రణ్‌బీర్ ఎప్పుడూ తాను ఒక పెద్ద స్టార్ లాగా చలామణి అవ్వాలని లేదా `లార్జర్ దన్ లైఫ్` ఇమేజ్‌ను ప్రదర్శించాలని అస్సలు ప్రయత్నించడని ఆయన పేర్కొన్నారు.
సినిమాల్లో ఎంతటి అద్భుతమైన నటనను కనబరిచినా.. నిజ జీవితంలో రణ్‌బీర్ చూపించే ఈ డౌన్-టు-ఎర్త్ స్వభావమే అతడిని ఒక విలక్షణమైన నటుడిగా మార్చిందని ఇంతియాజ్ అలీ విశ్లేషించారు. సాధారణంగా అంత పెద్ద సెలబ్రిటీ హోదా ఉన్నవారు సమాజంలో ప్రత్యేకంగా కనిపించడానికి తాపత్రయపడతారని, కానీ రణ్‌బీర్ మాత్రం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణంగా ఉండటానికే ఇష్టపడతాడని చెప్పారు. ఈ సరళత్వమే అభిమానులను సైతం అమితంగా ఆకట్టుకుంటుందని.. ఒక్కోసారి పెద్ద స్టార్లకు ఏ హంగూ అవసరం లేదనే విషయానికి రణ్‌బీర్ కపూరే నిదర్శనమని సోషల్ మీడియాలో సినీ ప్రియులు ఈ వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు.
రామాయణం ఈవెంట్ కి రణబీర్ స్కిప్ కారణం!
రణబీర్ ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో `రామాయణం` అనే చిత్రంలోను నటిస్తున్న విషయం తెలిసిందే. జూలై 24న ఢిల్లీలో జరగనున్న గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముందే రణ్‌బీర్ కపూర్ కంటి ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. రణ్‌బీర్ కుమార్తె రాహా కపూర్‌కు మొదట ఈ కంటి ఇన్ఫెక్షన్ సోకగా, ఆ తర్వాత అది రణ్‌బీర్‌కు కూడా సంక్రమించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రతిష్ఠాత్మక డిల్లీ ఈవెంట్లోను రణబీర్ పాల్గొనలేని పరిస్థితి ఉందని కథనాలొచ్చాయి. కానీ రణబీర్ ఈ ప్రచార కార్యక్రమాన్ని వదలాలనుకోవడం లేదు. కంటి కలక ఉన్నా కళ్లకు నల్లని అద్దాలు ధరించి వేడుకకు విచ్చేయాలని రణబీర్ ప్లాన్ చేయడం అతడి డెడికేషన్ ని చెబుతోంది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక `భారత్ మండపం`లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు మేకర్స్ `ప్రథమ్ సంకల్ప్`అనే పేరు పెట్టారు.
