Begin typing your search above and press return to search.

'ఓజీ'లోనూ ఇమ్రాన్ హ‌ష్మీ పెదవి ముద్దులా!

బాలీవుడ్ న‌టుడు ఇమ్రాన్ హ‌ష్మీ `ఓజీ`తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   14 Sept 2025 7:00 PM IST
ఓజీలోనూ ఇమ్రాన్ హ‌ష్మీ పెదవి ముద్దులా!
X

బాలీవుడ్ న‌టుడు ఇమ్రాన్ హ‌ష్మీ `ఓజీ`తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందు లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఢీకొట్టే ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ పోసిస్తున్నాడు. బాలీవుడ్ లో ఎంతో మంది న‌టులున్నా. సుజి త్ ఏరికోరి మ‌రి హష్మీణి రంగంలోకి దించాడు. ఓమీ బా పాత్ర‌లో అల‌రించ‌నున్నాడు. సినిమా స్టోరీ ఏంట న్న‌ది ఇప్ప‌టికే అధికారికంగానూ తేలిపోయింది. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీని భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా చూపించ‌బోతున్నారు. ఈ జానర్ సినిమాలు తెలుగు ఆడియ‌న్స్ కు కొత్తేం కాదు.

కానీ సుజిత్ ఈ క‌థ‌ను ఎలా డీల్ చేస్తున్నాడు? ఎంత కొత్త‌గా చెప్ప‌బోతున్నాడు? అన్న దానిపై ప్రాధాన్య‌త సంత రించుకుంది. రిలీజ్ కు ఇంకా ప‌ది రోజులే స‌మ‌యం ఉంది. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగి పోతుంది. ఈ నేప‌థ్యంలో హ‌ష్మీ పాత్ర‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ కూడా అందింది. ఈ సినిమాలోనూ ఇమ్రాన్ హ‌ష్మీ సీరియ‌ల్ కిస్సింగ్స్ లో ఏమాత్రం త‌గ్గ‌డంటున్నారు. ప్రియురాలితో హ‌ష్మీ ఘాటైన స‌న్నివేశాల్లోనూ అంతే హైలైట్ అవుతాడ‌న్న‌ది తాజా స‌మాచారం. సినిమాలో గెస్ట్ పాత్ర‌లో నేహా శెట్టి పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ పాత్ర తెర‌పై ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయేదే అయినా? నేహ‌శెట్టితో ఇమ్రాన్ హ‌ష్మీ పెద‌వి ముద్దుల స‌న్ని వేశం ఒక‌టుంటుందిట‌. నేహా శెట్టి రోల్ సినిమాలో విల‌న్ కొత్త గాళ్ ప్రెండ్ పాత్ర అట‌. ఈ నేప‌థ్యంలో ఇద్దరి మ‌ధ్య ఇంటిమేట్ స‌న్నివేశాలున్న‌ట్లు చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి ఇందులో వాస్త‌వం తెలియాలి. బాలీ వుడ్ లో ఇమ్రాన్ హ‌ష్మీ సినిమాలంటే? పెద‌వి ముద్దులు లేకుండా ఉండ‌వు. కంటెంట్ ఎలాంటిదైనా హ‌ష్మీ ఇమేజ్ నేప‌థ్యంలో లిప్ కిస్సుల‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. సుజిత్ కూడా `ఓజీ`లో అదే ఫార్ములాను అప్లై చేస్తున్న‌ట్లున్నాడు.

హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాగూ అలాంటి రొమాంటిక్ స‌న్నివేశాల్లో క‌నిపించ‌డు కాబ‌ట్టి ప‌వ‌న్ అభిమానులు విల‌న్ పాత్ర‌తో సంతృప్తి చెందాల్సిందే. సినిమాలో విల‌న్ గా హ‌ష్మీని ద్వేషించినా? పెద‌వి ముద్దు సీన్లు వ‌చ్చిన ప్ర‌తీసారి కూల్ అయిపోతారు. నేహ‌శెట్టి ఖాతాలో విజ‌యాలున్నా అమ్మ‌డికి ఈ మ‌ధ్య కాలంలో అకాశాలు రాలేదు. `గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి` త‌ర్వాత ఇంత వ‌ర‌కూ కొత్త సినిమాకు క‌మిట్ అవ్వ‌లేదు. దీంతో కెరీర్ ప‌రంగా గ్యాప్ ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో `ఓజీ`లో ఛాన్స్ రావ‌డం విశేషం. మ‌రి ఈ సినిమా అయినా? కొత్త అవకాశాలు తెచ్చి పెడుతుందేమో చూడాలి.