Begin typing your search above and press return to search.

క‌త్రిన‌తో డేట్‌ కెళ‌తాన‌న్న‌ సీరియ‌ల్ కిస్స‌ర్!

తాజా ఇంట‌ర్వ్యూలో హ‌ష్మి ప్ర‌క‌ట‌న అంద‌రికీ షాకిచ్చింది. ఒకసారి తన సహనటి కత్రినా కైఫ్‌ను డేట్‌కి తీసుకువెళ్లాల‌నే కోరికను అత‌డు వ్యక్తం చేశాడు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 11:30 AM GMT
క‌త్రిన‌తో డేట్‌ కెళ‌తాన‌న్న‌ సీరియ‌ల్ కిస్స‌ర్!
X

టైగర్ 3లో విల‌న్ గా న‌టించాడు ఇమ్రాన్ హ‌ష్మి. తన రా అండ్ రగ్డ్ లుక్ తో ఇటీవ‌ల‌ హెడ్ లైన్స్ లోకొచ్చిన అగ‌డు మ‌రోసారి ముఖ్యాంశాల్లోకి వ‌చ్చాడు. అత‌డి గురించి యువ‌త‌రంలో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. సీరియ‌ల్ కిస్స‌ర్ గా హ‌ష్మీకి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. మ‌ర్డ‌ర్ స‌హా చాలా చిత్రాల్లో క‌థానాయికల‌తో సుదీర్ఘ అద‌ర‌చుంబనాలు, బెడ్ రూమ్ స‌న్నివేశాల‌తో వేడెక్కించిన హ‌ష్మి ఇమేజ్ ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మైన‌ది.

ఇప్పుడు టైగ‌ర్ 3లో అత‌డి పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండ‌నున్నాయో స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుతోంది. తాజా ఇంట‌ర్వ్యూలో హ‌ష్మి ప్ర‌క‌ట‌న అంద‌రికీ షాకిచ్చింది. ఒకసారి తన సహనటి కత్రినా కైఫ్‌ను డేట్‌కి తీసుకువెళ్లాల‌నే కోరికను అత‌డు వ్యక్తం చేశాడు. యువ‌త‌రం అత్యంత ఇష్టపడే నటిగా క‌త్రిన‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. యువ‌హీరో విక్కీ కౌశల్‌తో వివాహం కార‌ణంగా ల‌క్ష‌లాది మంది హృదయాలను గాయ‌ప‌రిచిన క‌త్రిన పాపుల‌ర్ హీరో ఇమ్రాన్ హ‌ష్మీ హృద‌యాన్ని బ్రేక్ చేసిన విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది.

కరణ్ జోహార్ షో 'కాఫీ విత్ కరణ్‌'లో టైగ‌ర్ 3 బ్యాచ్ సంద‌డి చేయ‌నుంది. తాజా ప్రోమోలో ఇమ్రాన్ హష్మీ కత్రినపై తన ఫీలింగ్స్ ని ఏమాత్రం దాచుకోకుండా బహిరంగంగా వ్యక్తపరిచాడు. సీజన్ 8తో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న క‌ర‌ణ్‌ షోపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి.

ఒక బాలీవుడ్ హీరోయిన్ ని డేట్‌కి తీసుకెళ్లాల‌నుకుంటే ఆమె ఎవ‌రో చెప్పండి? అన‌గానే ఎలాంటి త‌డ‌బాటు లేకుండా తక్షణమే ఇమ్రాన్ హ‌ష్మి నుంచి సమాధానం వచ్చింది. కత్రినా కైఫ్ పేరును వెంట‌నే బ‌య‌ట‌పెట్టాడు.

నిజానికి ఇమ్రాన్ హష్మీకి వివాహం జరిగింది క‌దా? అని కరణ్ జోహార్ షోలో లాజిక్ లాగాడు. కత్రినా కైఫ్‌తో డేటింగ్‌కు వెళ్లాలనే కోరికను వ్యక్తపరచడమే కాకుండా, స్టార్ వైఫ్ ఒక‌రిని ఎంపిక చేస్తే, ఎవరిని దొంగిలించాలనుకుంటున్నారు? అని క‌ర‌ణ్‌ అడిగిన‌ ప్ర‌శ్న‌కు హ‌ష్మి నుంచి తక్షణమే సమాధానం వచ్చింది. అభిషేక్ భార్య ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్ పేరును అత‌డు బ‌య‌ట‌పెట్టాడు.

ఈ ర్యాపిడ్ ఫైర్‌లో ఇమ్రాన్ తన నిజాయితీని ప్రదర్శించాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో ముద్దు బెస్ట్ ముద్దు అని చెప్పిన అత‌డు, మల్లికా షెరావత్ తో ముద్దు చెత్త ముద్దు అనేసాడు. నిజానికి అత‌డు ద‌మ్మున్న‌వాడు అనిపించాడు అంటూ ఇప్పుడు నెటిజ‌నుల నుంచి ఒక సెక్ష‌న్ కామెంట్లు చేస్తోంది. స‌ల్మాన్ - క‌త్రిన‌- ఇమ్రాన్ హ‌ష్మి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన టైగ‌ర్ 3 దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ లో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.