Begin typing your search above and press return to search.

#అశ్వత్థామ.. ప్ర‌భాస్ కాదు.. అల్లు అర్జున్ కాదు!

`ఇమ్మోర్ట‌ల్ ఆఫ్ అశ్వత్థామ` అనౌన్స్‌ చేసి చాలా రోజులైంది. ఈ చిత్రానికి బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాలని భావించారు.

By:  Tupaki Desk   |   20 March 2024 5:06 AM GMT
#అశ్వత్థామ.. ప్ర‌భాస్ కాదు.. అల్లు అర్జున్ కాదు!
X

అనౌన్స్‌ చేసి చాలా రోజులైంది. ఈ చిత్రానికి బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాలని భావించారు. విక్కీ కౌశల్ టైటిల్ పాత్రను పోషించాల్సి ఉంది. అయితే సినిమా నిర్మాణంలో అనేక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి! నిర్మాతలు ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గడం నుండి విక్కీ కౌశల్ స్థానంలో ప్ర‌భాస్ న‌టిస్తార‌ని, లేదూ అల్లు అర్జున్‌తో చ‌ర్చ‌లు సాగించార‌ని ర‌క‌ర‌కాల‌ పుకార్లు షికార్ చేసాయి. ద‌క్షిణాది నుంచి ప్రభాస్, అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టుపై ఆస‌క్తిగా ఉన్నార‌ని క‌థ‌నాలు వైరల్ అయ్యాయి. అయితే ఇవేవీ నిజాలు కాలేదు. ఇటీవల `ఆర్టికల్ 370` ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆదిత్య ధ‌ర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు చెప్పాడు.

మేం నిజాయితీగా ఉన్నాం. ఇలాంటి ఒక భార‌తీయ సినిమాకు ప‌ని చేయ‌డం చాలా పెద్ద ఆశ‌యం. కానీ వీ.ఎఫ్.ఎక్స్‌ నాణ్య‌త కోసం మ‌న ద‌గ్గ‌ర‌ ఎవ‌రూ స‌రిగా ప్ర‌య‌త్నించ‌డం లేదు. సాంకేతికత అందుబాటులోకి వచ్చే వరకు లేదా సినిమా హాళ్లు పెరిగే వరకు వేచి ఉండాలి అని ఆధిత్య‌ధ‌ర్ అన్నారు.

కానీ ఇప్పుడు అత‌డి వ్యాఖ్య‌ల‌కు భిన్న‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడిగా `అశ్వ‌త్థామ` చిత్రాన్ని రూపొందించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. అయితే ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించడం లేదు. సచిన్ రవి దర్శకత్వం వహిస్తారు. `అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్` పేరుతో ఈ చిత్రాన్ని షాహిద్ ఈరోజు ప్రకటించారు. హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం (ఐదు) భాషల్లో ఈ చిత్రం పాన్-ఇండియా కేట‌గిరీలో విడుదల కానుంది.

ఈ ప్రాజెక్ట్‌కు వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్‌శిఖా దేశ్‌ముఖ్ నిర్మాత‌లుగా మ‌ద్ధ‌తు ఇవ్వనున్నారు. గోవాలో రకుల్ ప్రీత్ సింగ్‌తో జరిగిన తన వివాహానికి షాహిద్ కూడా హాజరు కావడంతో జాకీతో కలిసి ఒక చిత్రానికి సంతకం చేశాడని కొంతకాలంగా పుకార్లు షికార్ చేసాయి. షాహిద్ చివరిగా `తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా`లో కనిపించాడు. ప్రస్తుతం `దేవా` షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.