Begin typing your search above and press return to search.

ఆయ‌న‌కే ఐఎండీబీ అగ్ర‌స్థానం క‌ట్టబెట్టింది

ప‌ఠాన్..జ‌వాన్ లాంటి వ‌రుస భారీ విజ‌యాల‌తో షారుక్ కి ఈ స్థానం ద‌క్కిన‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   23 Nov 2023 3:30 PM GMT
ఆయ‌న‌కే ఐఎండీబీ అగ్ర‌స్థానం  క‌ట్టబెట్టింది
X

దేశ వ్యాప్తంగా ఎంతో మంది స్టార్ హీరోలున్నారు. ఎవ‌రి ప్ర‌త్యేక‌త వారిది. విజ‌యాలు...పారితోషికాలు.. పాపులారిటీ..సంపాద‌న వంటి అంశాలు ఆ స్టార్ హీరోల స్థానాల‌నేవి ఆధార‌డి ఉంటాయి. తాజాగా ప్ర‌ఖ్యాత ఐఎమ్ డీబీ సంస్థ మోస్ట్ పాపుల‌ర్ స్టార్స్ 2023 జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో మొద‌టి స్థానంలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నిలిచారు. ప‌ఠాన్..జ‌వాన్ లాంటి వ‌రుస భారీ విజ‌యాల‌తో షారుక్ కి ఈ స్థానం ద‌క్కిన‌ట్లు తెలుస్తోంది.

ఇదే ఏడాది చాలా మంది స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ వాళ్లంద‌రి క‌ల్లా షారుక్ మెరుగైన స్థానంలో ఉండటం స‌హా..పాపులారిటీ ప‌రంగానూ ముంద‌జ‌లో ఉండ‌టంతో ఐఎండీబీ ఆయ‌న‌కే తొలిస్థానం క‌ట్ట‌బెట్టింది. ఇక రెండవ స్థానంలో యువ నాయిక అలియాభ‌ట్ నిలిచింది. అలియా భ‌ట్ ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డు కైవసం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. `గంగూబాయి క‌తియావాడి` చిత్రానికి గానూ అమ్మ‌డు అవార్డు అందుకుంది.

అలియా ఆ సినిమాతో సోలోగా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటింది. దాదాపు 300 కోట్ల వ‌సూళ్ల‌తో లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్ లా నిలిచింది. ఇక మూడ‌వ స్థానంలో దీపికా పదుకుణే ద‌క్కించుకుంది. వీళ్ల‌తో పాటు జ‌వాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వామికా గ‌బ్బి..న‌య‌న‌తార‌..త‌మ‌న్నా.. కరీనా క‌పూర్.. శోభితా ధూళిపాళ‌..అక్ష‌య్ కుమార్.. విజ‌య్ సేతుప‌తి కూడా టాప్ టెన్ స్థానంలో నిలిచారు.

ఈసంద‌ర్భంగా అలాభ‌య‌ట్ సంతోషం వ్య‌క్తం చేసింది. మ‌రిన్ని స్పూర్తిదాయ‌క‌మైన చిత్రాలు..క‌థ‌ల్ని ఎంపిక చేసుకుంటాన‌ని హామీ ఇచ్చింది. అయితే ఉత్త‌మ న‌టిగా నిలిచిన కృతి స‌న‌న్ కి మాత్రం ఈ జాబితాలో స్థానం ద‌క్క‌లేదు. అలియాతో పాటు ఆమె కూడా జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆమెని స్కిప్ చేసి జ‌వాన్ లో న‌టించిన న‌టులకు స్థానం క‌ల్పించ‌డం విశేషం.