Begin typing your search above and press return to search.

వార‌సుడితో ఇలియానా అల్లిబిల్లి ఆట‌లు

తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలియానా చిన్నారి కోవాతో ఆడుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   9 Oct 2023 3:45 PM GMT
వార‌సుడితో ఇలియానా అల్లిబిల్లి ఆట‌లు
X

ఇలియానాలో ఆనందం ఆవ‌ర్ణ‌మైంది. ఇలాంటి ఆనందం క‌నీవినీ ఎరుగ‌నిది. త‌న‌లో ఎన్న‌డూ చూడ‌నిది. గ‌డిచిన చాలా కాలంగా ఇలియానా ర‌కర‌కాల ఒత్తిళ్ల‌కు లోనైంది. డిప్రెష‌న్ ని ఎదుర్కొని దాని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు చాలా స‌మ‌యం తీసుకుంది. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు త‌న జీవితంలో ఎంతో గొప్ప ఆనంద‌క్ష‌ణాల‌ను ఆస్వాధిస్తోంది. దీనికి కార‌ణం త‌న జీవితంలోకి వ‌చ్చిన ఆ పండంటి తొలిచూరు బిడ్డ‌డు.


ఇలియానా నిజానికి తన భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేయ‌కుండానే, ఫ్రెగ్నెన్సీ గురించి ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తరువాత తన భర్తను దాచిపెట్టి కొన్నాళ్ల‌కు ఫోటో షేర్ చేసింది. ఇటీవ‌ల‌ మగబిడ్డను ప్రసవించింది. బాల‌కుడు నట్టింటికి వ‌చ్చి ఇప్పటికే రెండు నెలలకు పైగా అయింది. కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు కూడా పెట్టుకుంది.


ఇటీవ‌ల చిన్నారి కోవా ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలియానా చిన్నారి కోవాతో ఆడుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఇలియానాలోని ఈ ఆనందం చూశాక ప‌రిశ్ర‌మ స‌న్నిహితులు ప్ర‌శంసిస్తున్నారు. త‌న‌పై ప్రేమ‌ను కురిపిస్తున్నారు. మలైకా, అథియా శెట్టి, నర్గీస్ ఫక్రీ త‌దిత‌ర‌ స్నేహితులు ల‌వ్ ఈమోజీల్ని షేర్ చేసారు.


ఇలియానా మైఖేల్ డోలన్‌ను 13 మే 2023న ప్ర‌చారార్భాటానికి దూరంగా వివాహం చేసుకుంది. త‌న పెళ్లి విష‌యాన్ని దాచి పెట్టింది. గర్భం దాల్చడానికి నాలుగు వారాల ముందు ఈ జంట వివాహం జ‌రిగింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇటీవ‌ల త‌న వార‌సుడితోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న ఇలియానా న‌ట‌న‌కు చిన్న‌పాటి విరామం తీసుకుంది.

గోవా బ్యూటీ చివరిసారిగా 'సబ్ గజాబ్..' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. అభిషేక్ బచ్చన్ నటించిన 'ది బిగ్ బుల్' 2021లో విడుదలైంది. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఇలియానా న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ఇప్పుడు అన్‌ఫెయిర్ & లవ్లీ - లవర్స్ చిత్రాలలో న‌టిస్తోంది. ల‌వ‌ర్స్ చిత్రంలో ప్రతీక్ గాంధీ - విద్యాబాలన్ ల‌తో కలిసి తెరపై క‌నిపించ‌నుంది.