Begin typing your search above and press return to search.

ఇలియానా మొదటి సారి అలా..!

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   29 Feb 2024 3:30 PM GMT
ఇలియానా మొదటి సారి అలా..!
X

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా ఈ మధ్య కాలంలో మునుపటి జోష్ ను కొనసాగించడంలో విఫలం అవుతున్న ఇలియానా పెళ్లి తర్వాత మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

పెళ్లి ఆపై తల్లి అయిన ఇలియానా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయినట్లే అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేశారు. కానీ ఇలియానా మాత్రం పెళ్లి తర్వాత కూడా తాను వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాను అన్నట్లుగా తేరా క్యా హోగా లవ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రణదీప్ కీలక పాత్రలో నటిస్తున్న తేరా క్యా హోగా సినిమాను మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇలియానా ను డీ గ్లామర్‌ రోల్‌ లో చూడబోతున్నట్లుగా ట్రైలర్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.

కలర్ తక్కువ ఉన్న ఒక డీ గ్లామర్ అమ్మాయి పెళ్లి కోసం తాపత్రయ పడే పాత్ర లో ఇలియానా కనిపించబోతుంది. వరకట్నం మరియు స్కిన్‌ కలర్‌ విషయమై ఈ సినిమాలో దర్శకుడు చర్చించబోతున్నాడు. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో ఇలియానా కుమ్మేసి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బల్వీందర్ సింగ్ జంజువా దర్శకత్వం వహించిన ఈ సినిమాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్ణయించారు. ఈ సినిమా కమర్షియల్‌ గా హిట్‌ అయితే ఇలియానా కచ్చితంగా బాలీవుడ్‌ లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.