Begin typing your search above and press return to search.

ఆ బ్యూటీ రెండేళ్ల గ్యాప్ అనంత‌రం?

అమ్మ‌డు హిందీలో సినిమాలు చేసి మూడేళ్లు దాటింది. చివరిగా 2021 లో ది బిగ్ బ‌ల్ అనే సినిమాలో న‌టించింది

By:  Tupaki Desk   |   29 Feb 2024 8:07 AM GMT
ఆ బ్యూటీ రెండేళ్ల గ్యాప్ అనంత‌రం?
X

గోవా బ్యూటీ ఇలియానికి-టాలీవుడ్కి సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి. అమ్మ‌డు బాలీవుడ్ కి వెళ్లిన ద‌గ్గ‌ర నుంచి అక్క‌డే కెరీర్ ని నిర్దేశించుకుని ముందుకెళ్లింది. అక్క‌డా కొన్నాళ్ల పాటు న‌టిగా స‌త్తా చాటింది. అయితే అక్క‌డా అవ‌కాశాలు స‌న్న‌గిల్లినా స‌మ‌యంలో మ‌ళ్లీ టాలీవుడ్ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ రూపంలో మ‌రో అవ‌కాశం ఇచ్చింది. కానీ ఆసినిమా వైఫ‌ల్యంతో ఇలియానా పేరు వైర‌ల్ అవ్వ‌లేదు.

వ‌చ్చింది..వెళ్లింది అనే మాట త‌ప్ప ఇలియానా బ్రాండ్ ఇమేజ్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో ఇలియానా క్రేజ్ త‌గ్గిన మాట వాస్త‌వ‌మే అన్న సంగ‌తి అర్ద‌మైంది. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ హిందీ ప్రాజెక్ట్ ల్లోనే బిజీ అయిం ది. ఈ క్ర‌మంలో పెళ్లి కాకుండానే త‌ల్లి అవ్వ‌డం లాంటి విమర్శ‌లు తీవ్ర స్థాయిలో ఎదుర్కుంది. దీంతో అవ‌కాశాల‌కు దూర‌మైంది. విమ‌ర్శ‌ల‌తోనే అవ‌కాశాలు కోల్పోయిందా? అన్న సందేహం సైతం తెర‌పైకి వ‌చ్చింది.

అమ్మ‌డు హిందీలో సినిమాలు చేసి మూడేళ్లు దాటింది. చివరిగా 2021 లో ది బిగ్ బ‌ల్ అనే సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత మ్యాక‌ప్ కి పూర్తిగా దూర‌మైంది. సోష‌ల్ మీడియాలో అభిమానుల‌కు ఫోటోల‌తో ట‌చ్ ల ఉండ‌టం త‌ప్ప సినిమాల్లో క‌నిపించింది లేదు. అయితే మ‌ళ్లి ఇలా సైలెంట్ గా స‌ర్ ప్రైజ్ చేస్తుంది అన్న సంగ‌తి మాత్రం ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. కొత్త ఏడాదిలో ఏకండా రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోంది.

`డు ఔర్ డు ప్యార్` అనే సినిమాతో పాటు `తేరా క్యాహో ల‌వ్లీ` అనే చిత్రంలో న‌టిస్తుంది. ఇందులో `డు ఔర్ డు ప్యార్ `అనే సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగు తున్నాయి. `తేరా క్యా హూ ల‌వ్లీ` చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉంది. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది రిలీజ్ కానున్నాయి. ఈసినిమాలు విజ‌యం సాధిస్తే ఇలియానా మ‌ళ్లీ ఫామ్ లో కి వ‌చ్చేస్తుంది అన్న ధీమాలో అభిమానులున్నారు.