Begin typing your search above and press return to search.

#మై లిటిల్.. ఇలియానా బేబీ బంప్ ప్ర‌ద‌ర్శ‌న‌

అద్భుతమైన ఎరుపు రంగు దుస్తులలో పూర్తిగా ఎదిగిన తన బేబీ బంప్‌ ను ప్రదర్శిస్తూ మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   26 July 2023 2:42 PM GMT
#మై లిటిల్.. ఇలియానా బేబీ బంప్ ప్ర‌ద‌ర్శ‌న‌
X

రంగుల ప్ర‌పంచంలో క‌థానాయిక‌గా ప్ర‌య‌త్నించ‌డ‌మే ఒక సాహ‌సం. ఎగుడుదిగుడు ప్ర‌పంచంలో ఈదుకుంటూ ముందుకు సాగ‌డం అసాధార‌ణమైన అడ్వెంచ‌ర్. ఇక్క‌డ చ‌ద‌రంగం లో పావులు క‌ద‌ప‌డం ఎలానో తెలియాలి. గాడ్ ఫాద‌ర్ లేకున్నా ఎదిగి చూపించాలి. వీట‌న్నిటినీ చేసి చూపించింది ఇలియానా.


త‌న‌దైన ముగ్ధ‌మ‌నోహ‌ర రూపం తో కుర్రకారు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చిన ఈ గోవా బ్యూటీ టాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌గా ఏలింది. సౌతిండియా లో బిగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత కాల‌క్ర‌మంలో పెరిగే వ‌య‌సుతో పాటే అవ‌కాశాలు కోల్పోయింది. అయినా హిందీ ప‌రిశ్ర‌మ‌లో ఫైనెస్ట్ పెర్ఫామెన్సెస్ తో అక్క‌డా త‌న క‌ల‌ల్ని నిజం చేసుకుంది.

నిజానికి విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్ తో బ్రేక‌ప్ త‌ర్వాత తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయిన ఇలియానా దాని నుంచి కోలుకోవ‌డానికి కొన్ని సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌ట్టింది. ఏదేమైనా ఇల్లీ బేబీ నెమ్మ‌దిగా కోలుకుంటోంది. అనంత‌రం ఇటీవ‌లి కాలం లో ఇల్లీ త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. ఇప్పుడు స్వీయ‌నిర్ణ‌యాల‌తో త‌న జీవితాన్ని కొత్త దారిలోకి మ‌రల్చింది. స‌నాత‌న ధ‌ర్మాలు సాంప్ర‌దాయాలు అంటూ మాట్లాడుకునే భార‌తీయ స‌మాజంలో మొన్న‌టికి మొన్న స‌రికొత్త ప్ర‌క‌ట‌న‌తో సంచ‌ల‌నం సృష్టించింది. తాను పెళ్లి కాకుండానే గ‌ర్భం ధ‌రించాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన మేటి ధీర అనిపించింది.

గర్భధారణ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్నాళ్ల పాటు పుట్ట‌బోయే బిడ్డ‌కు తండ్రి ఎవ‌రు? అన్న‌ది వెల్ల‌డించ‌ని ఇలియానా ఎట్టకేల కు వారం క్రితం అత‌డి ఫోటోల ను రివీల్ చేసింది. ఇప్పుడు మ‌రో అప్ డేట్ తో అభిమానుల ముందుకు వచ్చింది.

ఈ రోజు అద్భుతమైన ఎరుపు రంగు దుస్తులలో పూర్తిగా ఎదిగిన తన బేబీ బంప్‌ ను ప్రదర్శిస్తూ మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేసింది. దీనికి 'మై లిటిల్'అని క్యాప్ష‌న్ ని ఇచ్చింది. ప‌రిశ్ర‌మ స‌న్నిహితుల నుంచి అభిమానుల నుంచి హార్ట్ ఈమోజీలు ఇలియానా టైమ్ లైన్ లో వెల్లువెత్తాయి. క్యూట్ ఇలియానా రాక‌ కు స‌మ‌య‌మాస‌న్న‌మైంది! అంటూ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేసారు.