Begin typing your search above and press return to search.

ఆ స‌మ‌యంలో నావాడు నాతోనే ఉన్నాడు: ఇలియానా

ఇది చాలా మంది కొత్త తల్లులు తమ పిల్లలకు నర్సింగ్ లేదా పంపింగ్ చేసే ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారు ఎదుర్కొనే పరిస్థితిని ఎంతో ఫ‌న్నీగా రివీల్ చేసింది.

By:  Tupaki Desk   |   21 Aug 2023 4:04 AM GMT
ఆ స‌మ‌యంలో నావాడు నాతోనే ఉన్నాడు: ఇలియానా
X

గోవా బ్యూటీ ఇలియానా డి క్రూజ్ వ్య‌క్తిగ‌త జీవితంలో వ‌రుస ఇన్సిడెంట్స్ గురించి తెలిసిన‌దే. తొలుత విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్ తో స్నేహం ప్రేమ‌, అటుపై డేటింగ్ బ్రేక‌ప్ వ‌గైరా ఎంతో డిస్ట్ర‌బ్ చేసాయి. ఈ బ్రేక‌ప్ వ‌ల్ల‌ తీవ్ర ఒత్తిడికి గురైన ఇలియానా బాగా బ‌రువు పెరిగింది. అటుపై బ‌రువు త‌గ్గేందుకు బాగా శ్ర‌మించింది. చాలా కాలం ఒంట‌రిగానే జీవించింది. అదే క్ర‌మంలో క‌త్రిన సోద‌రుడు సెబాస్టియ‌న్ తో ఇలియానా ప్రేమ‌లో ప‌డింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

కానీ ఇంత‌లోనే మ‌రో షాక్ ఇచ్చింది ఇల్లీ. త్వ‌ర‌లో త‌న మొద‌టి బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తున్నాన‌ని ప్ర‌కటించి తండ్రి ఎవ‌రో రివీల్ చేయ‌లేదు. దీంతో అభిమానుల్లో బోలెడ‌న్ని సందేహాలు.. ఇంత‌లోనే త‌న మొద‌టి బిడ్డ తండ్రి ఈయ‌న అంటూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. ఇటీవల తన మొదటి బిడ్డకు జ‌న్మ‌నిచ్చి మ‌మ్మీ అయింతి. కోవా ఫీనిక్స్ డోలన్ అనే మగబిడ్డను ఆగష్టు 1న స్వాగతించింది.

ఇన్‌స్టాలో తన ఆనందాన్ని అభిమాన‌ ప్రపంచంతో పంచుకుంది. తన నవజాత కుమారుని తాలూకా ఫోటోల‌ను ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది. అయితే తాను మాతృత్వంలో ప్ర‌వేశించిన‌ప్పుడు త‌న‌ ప్రయాణాన్ని అనుభవాలను ఇలియానా నిజాయితీగా షేర్ చేసింది. ఇటీవలి ఇన్ స్టాగ్రామ్ సహా ప్రతిచోటా మ‌మ్మీ ఇలియానా త‌న ఆనందాన్ని తెలియ‌జేస్తూనే ఉంది.

తాజాగా మ‌రో అంద‌మైన‌ జ్ఞాపకాన్ని ఇలియానా పోస్ట్ చేసింది. ఇది చాలా మంది కొత్త తల్లులు తమ పిల్లలకు నర్సింగ్ లేదా పంపింగ్ చేసే ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారు ఎదుర్కొనే పరిస్థితిని ఎంతో ఫ‌న్నీగా రివీల్ చేసింది. న‌టుడు టామ్ హాంక్స్ ఫోటోని జ‌త‌ చేసి .. ''మీరు మీ బిడ్డ కోసం నర్సు వ‌ద్ద‌కు లేదా పంప్‌కి వెళ్ళినప్పుడు... కానీ మీరు మీ నీరు, స్నాక్స్ ఫోన్‌ను మర్చిపోయారు'' అని కొత్త తల్లులు తరచుగా ఎదుర్కొనే సవాళ్లను హాస్యాస్పదంగా రాసింది. అందుకే నా వాడు నా చెంత‌నే ఉన్నాడు.. వెన్నుద‌న్నుగా నిలిచాడు! అని కూడా ఇలియానా గ‌ర్వంగా వెల్ల‌డించింది. తన మాతృత్వ ప్రయాణం అవసరాలు సవాళ్లను అర్థం చేసుకోవడంలో తన భాగస్వామి మద్దతు ఎంతో ఉంద‌ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ కథనంలో తెలిపింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇలియానా డి క్రజ్ చివరిగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి 'ది బిగ్ బుల్‌'లో కనిపించింది. తర్వాత రణ్‌దీప్ హుడాతో కలిసి తేరా క్యా హోగా లవ్లీలో కనిపించనుంది. ఇంకా పేరు పెట్టని విద్యాబాలన్ - ప్రతీక్ గాంధీ చిత్రంలో కూడా ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది.