Begin typing your search above and press return to search.

రెండేళ్ల త‌ర్వాత గోవా బ్యూటీ మెరుపులు!

గోవా బ్యూటీ ఇలియానా వెండి తెర‌పై మెరిసి రెండేళ్లు అవుతోంది. 'ది బిగ్ బుల్' సినిమా త‌ర్వాత తెర‌పై క‌నిపించింది లేదు

By:  Tupaki Desk   |   18 Jan 2024 2:30 PM GMT
రెండేళ్ల త‌ర్వాత గోవా బ్యూటీ మెరుపులు!
X

గోవా బ్యూటీ ఇలియానా వెండి తెర‌పై మెరిసి రెండేళ్లు అవుతోంది. 'ది బిగ్ బుల్' సినిమా త‌ర్వాత తెర‌పై క‌నిపించింది లేదు. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎదురైన స‌వాళ్ల తో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది త‌ప్ప‌! సిని మాల ప‌రంగా ఇలియానా పేరు వినిపించ‌లేదు. వివాహం కాకుండానే త‌ల్లి అవ్వ‌డం...అటుపై వాటికి పుల్ స్టాప్ పె ట్టేందుకు అమ్మ‌డు చేసిన ప్ర‌య‌త్నాల‌తోనే రెండేళ్లు గ‌డిచిపోయింది. దీంతో కెరీర్ ప‌రంగా ఏర్ప‌డిన గ్యాప్ ఇది.


ఇప్పుడా గ్యాప్ ని పుల్ ఫిల్ చేయాలంటే? మ‌ళ్లీ మున‌ప‌టిలా సినిమాలు చేయ‌డ‌మే ఆప్ష‌న్. మ‌రి ఆ దిశ‌గా అమ్మ‌డు ముందుకు క‌దులుతోందా? అంటే అవున‌నే తెలుస్తోంది. సీనియ‌ర్ న‌టి విద్యాబాల‌న్ తో క‌లిసి సినిమా చేసేందుకు రెడీ అవుతుంది. వారిద్ద‌రు ప్ర‌ధాన పాత్రల్లో ప్ర‌తీక్ గాంధీ..సెంథిల్ రామ‌మూర్తిల‌కు జోడీగా న‌టిస్తోన్న చిత్రం 'దో ఔర్ దో ప్యార్'. ఈ సినిమాతో శిరీష గుహా ఠాకూర్తా ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. అలాగే చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో ఇలియానా రెండేళ్ల గ్యాప్ అనంత‌రం రిలీజ్ అవుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. అలాగే 'అన్ ఫెయిర్ అండ్ ల‌వ్ లీ' అనే చిత్రంలో కూడా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది. ఇక ఈ సినిమాతో పాటు అమ్మ‌డు మ‌రో రెండు..మూడు ప్రాజెక్ట్ లకు కూడా సైన్ చేసిన‌ట్లు స‌మాచారం.

అయితే వాటి వివ‌రాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. తాజా సినిమా విష‌యాన్ని కూడా ఇంత‌వ‌ర‌కూ ఇలియానా ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు.చిత్ర యూనిట్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ అయ్యే వ‌ర‌కూ ఇలియానా కంబ్యాక్ అవుతుంది అన్న విష‌యం కూడా ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు. మ‌రి ఇలియానా కెరీర్ ప‌రంగా ఇలాంటి ర‌హస్యాలు ఎందుకు తీసుకుంటుంది అన్న‌ది తెలియాలి.