Begin typing your search above and press return to search.

ఇలియానా 3 నెల‌ల‌కు పుట్టిన‌రోజు?

వీటిని షేర్ చేస్తూ ఇలియానా ఇలా రాసింది, ''3 నెలలు (ఎరుపు గుండె) ఎవరైనా నా కోసం సమయాన్ని తగ్గించారు'' అని వ్యాఖ్యానించింది.

By:  Tupaki Desk   |   3 Nov 2023 9:39 AM GMT
ఇలియానా 3 నెల‌ల‌కు పుట్టిన‌రోజు?
X

ఇలియానా డి క్రజ్ ఈ ఏడాది ఆగస్టు 1న మగబిడ్డను ప్ర‌స‌వించిన సంగ‌తి తెలిసిందే. త‌న బిడ్డ ఫోటోల‌ను షేర్ చేస్తూ అమ్మ‌త‌నంలో క‌మ్మ‌ద‌నం గురించి సోష‌ల్ మీడియాల్లో ఎంతో ఎమోష‌న‌ల్ అయింది. 2023 ఆగస్టు 5న తన ఇన్‌స్టాగ్రామ్‌లో శుభవార్తని షేర్ చేసింది. తన అభిమానులు అనుచరులను అప్‌డేటెడ్‌గా ఉంచడానికి తన బేబీ బంప్ ఫోటోలు వీడియోలను షేర్ చేసిన ఇలియానా చివరకు నవంబర్ 1న మూడు నెలలు నిండిన తన బిడ్డ‌కు పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించుకుంది. తన కొడుకు మూడు నెలల పుట్టినరోజును జరుపుకోవడానికి కోవా ఫీనిక్స్ డోలన్ క్యూట్ ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేసింది.

ఇల్లీ వార‌సుడు కోవా ఫీనిక్స్ డోలన్ కి నవంబర్ 1తో మూడు నెలలు పూర్తయ్యాయి. ఇటీవ‌లే త‌న‌ మగబిడ్డతో అమూల్యమైన క్షణానికి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఇలియానా వేళ్లు కోవా చిటికెన వేళ్లతో ఇంటర్‌లాక్ అయి క‌నిపిస్తున్నాయి. వీటిని షేర్ చేస్తూ ఇలియానా ఇలా రాసింది, ''3 నెలలు (ఎరుపు గుండె) ఎవరైనా నా కోసం సమయాన్ని తగ్గించారు'' అని వ్యాఖ్యానించింది.

అక్టోబర్‌లో ముందుగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో మగబిడ్డ ఫోటోని షేర్ చేసింది. దీనికి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించింది. బేబీ అండ్ మామా మొదటి రోజు లంచ్ తింటున్నారు.. అని రాసింది. అంటే అప్ప‌టికి మిల్క్ ఫీడింగ్ తో పాటు, అస‌లైన‌ డైట్ స్టార్ట‌యింద‌ని భావించాలి. తన బిడ్డను మొదటిసారి బయటకు తీసుకెళ్తున్నప్పుడు ఇలియానా చాలా ఉత్సాహంగా క‌నిపించింది. ఆగస్ట్ 5న ఇలియానా తన మగబిడ్డ రాకకు సంబంధించిన శుభవార్తను హృదయపూర్వక పోస్ట్‌లో ప్రకటించింది. తన మగబిడ్డ మొదటి ఫోటోని షేర్ చేస్తూ..త‌న‌ పేరును కూడా వెల్లడిస్తూ, ''మా డార్లింగ్ అబ్బాయిని హృదయాలను దాటి ప్రపంచానికి స్వాగతిస్తున్నందుకు మనం ఎంత సంతోషంగా ఉన్నామో పదాలు చెప్పలేవు'' అని పోయెటిక్ క్యాప్షన్ ఇచ్చింది.