Begin typing your search above and press return to search.

గోవా బ్యూటీ పిల్ల‌ల‌ని అలా పెంచుతుంద‌ట‌!

వ‌రుస‌గా సినిమాలు ఫ్లాప్ కావ‌డం..అదే స‌మ‌యంలో బాలీవుడ్ అవ‌కాశాలు త‌లుపుత‌ట్ట‌డంతో టాలీవుడ్ని వీడి బాలీవుడ్‌కు చెక్కేసింది.

By:  Tupaki Desk   |   9 May 2025 7:43 AM
గోవా బ్యూటీ పిల్ల‌ల‌ని అలా పెంచుతుంద‌ట‌!
X

`దేవదాసు` సినిమాతో టాలీవుడ్‌లో కాక‌రేపిన గోవా బ్యూటీ ఇలియానా. త‌న‌దైన మార్కు గ్లామ‌ర్‌తో ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచి క్రేజీ ఆఫ‌ర్ల‌ని అతి త‌క్కువ టైమ్‌లోనే సొంతం చేసుకుని టాప్ హీరోయిన్‌ల జాబితాలో చేరింది. పోకిరి, కిక్‌, రాఖీ, మున్నా, జ‌ల్సా, జులాయి వంటి సినిమాల‌తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టించిన ఇలియానా ఆ త‌రువాత తెలుగులో క్రేజ్‌ని కోల్పోతూ వ‌చ్చింది. వ‌రుస‌గా సినిమాలు ఫ్లాప్ కావ‌డం..అదే స‌మ‌యంలో బాలీవుడ్ అవ‌కాశాలు త‌లుపుత‌ట్ట‌డంతో టాలీవుడ్ని వీడి బాలీవుడ్‌కు చెక్కేసింది.

అక్క‌డి కూడా క్రేజ్ త‌గ్గ‌డం, చెప్పుకోద‌గ్గ అవకాశాలు కూడా లేక‌పోవ‌డంతో ఇల్లీబేబీ అక్క‌డ కూడా సినిమాల‌కు దూరంగా ఉండ‌టం మొద‌లు పెట్టింది. కొంత‌మ కాలంగా ప్రేస్తున్న త‌న ప్రియుడు మైఖేల్ డోల‌న్‌ని పెళ్లి చేసుకున్న ఇలియానా ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చింది. త్వ‌ర‌లో మ‌రోసారి త‌ల్లికాబోతున్న ఇలియానా త‌న పిల్ల‌ల గురించి తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. పిల్ల‌ల్ని ఎలా పెంచాల‌నుకుంటోందో, వారు ఎలా ఉండాలో ఎలా ఉండ‌కూడ‌దో వివ‌రించింది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా పిల్ల‌ల‌ని మంచిగా పెంచాలి త‌ల్లిగా ఏం చేయాలి? నిజ‌మైన ప్రేమ అంటే ఏమిటీ? అని అడిగారు. ఈ ప్ర‌శ్న‌కు స్పందించిన ఇలియానా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `పిల్ల‌ల్ని ప్రేమ సంపాదించుకోవాలి` అనే విధంగా మాత్రం పెంచ‌ను. ఎందుకంటే నేను అనుభ‌వించిన అత్యంత చెత్త అనుభూతి అది. ప్రేమ స్వ‌త‌హాగా ఉండాలి. అది సం్పాదించుకుంటే వ‌చ్చేది కాదు. గౌర‌వం ఆనందంలా ప్రేమ కూడా స‌హ‌జంగా వ‌చ్చేది.

నేను సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే ద‌య‌గ‌ల పిల్ల‌లుగా పెంచాల‌నుకుంటున్నాను. అంద‌రు త‌ల్లిదండ్రులు అలానే భావిస్ంతారు. పిల్ల‌లు ఎంత‌గా ప్రేమించ‌బుతున్నారో తెలుసుకోవ‌డానికి నేను నా వంతు కృషి చేస్తాను. స‌హ‌జ‌సిద్ధ‌మైన త‌ల్లి ప్రేమ‌, ఎమోష‌న్స్‌ని ఇష్ట‌ప‌డ‌తాను` అంటూ వివ‌రించిందీ ఇల్లీ బేబీ. గ‌త ఏడాది హిందీలో నెండు సినిమాలు చేసిన ఇలియానా ఇంత వ‌ర‌కు మ‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్‌ని అంగీక‌రించ‌లేదు.