డోలన్ వంశాన్ని పెంచి పోషిస్తున్న ఇలియానా
ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ నుంచి విడిపోయాక, ఇలియానా తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లింది. ఆ సమయంలో అధిక బరువు సమస్యల్ని ఎదుర్కొంది.
By: Tupaki Desk | 28 Jun 2025 11:40 AM ISTఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ నుంచి విడిపోయాక, ఇలియానా తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లింది. ఆ సమయంలో అధిక బరువు సమస్యల్ని ఎదుర్కొంది. ఆ తర్వాత చాలా కాలం ఒంటరిగా జీవించిన ఇలియానా, నెమ్మదిగా అన్ని ఆటుపోట్ల నుంచి కోలుకుని, ఎట్టకేలకు మైఖేల్ డోలన్ లో రెండో లవ్ ని సక్సెస్ చేసుకుంది. ఇది నిజానికి గ్రేట్ కంబ్యాక్. విదేశీ ప్రియుడు డోలన్ ని ఇలియానా రహస్యంగా వివాహమాడింది. తన పెళ్లికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకుండా సీక్రెసీ మెయింటెయిన్ చేసింది. అయితే డోలన్ తో పెళ్లిని ధృవీకరించాక, కొన్ని నెలలకే గర్భాన్ని కూడా ధృవీకరించింది.
ఇలియానా- మైఖేల్ 2023లో వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం ఆగస్టులో వారి మొదటి బిడ్డ కోవా ఫీనిక్స్ డోలన్‌ను స్వాగతించారు. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనిచ్చినట్టు ఇలియానా ధృవీకరిస్తూ సంబంధిత ఫోటోను కూడా సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. రెండో బిడ్డ కూడా మగ బిడ్డ. నవజాత శిశువు ప్రశాంతంగా నిద్రపోతూ ఈ ఫోటోలో కనిపించాడు. మా హృదయాలు చాలా నిండి ఉన్నాయి. 19 జూన్ 2025న జననం అని ఇలియానా తెలిపింది. రెండవ బిడ్డ పేరు- కీను రాఫే డోలన్ పేరు. ఇలియానా ఇలా తన రెండో బిడ్డ ఫోటోను షేర్ చేయగానే చాలామంది అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. బార్బీ సహనటి ప్రియాంక చోప్రా కూడా ఇలియానాకు శుభాకాంక్షలు తెలిపింది. డోలన్ వంశాన్ని ఇండియాలో పెంచి పోషిస్తున్న ఇలియానాకు అభిమానులంతా శుభాకాంక్షలు చెబుతున్నారు.
నిజానికి అక్టోబర్ 2024లో ఇలియానా తన రెండవ గర్భధారణను ధృవీకరించింది. కొన్ని నెలల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో `ఆస్క్ మీ ఎనీథింగ్` సెషన్ లో బిడ్డ పెంపకం గురించి ఆశ్చర్యకరమైన సూచనలు చేసింది.
పిల్లలకు దుష్టత్వం, క్రూరత్వం నేర్పకూడదని, ప్రేమను, గౌరవంగా జీవించడాన్ని నేర్పించాలని కూడా ఇలియానా క్లాస్ తీస్కుంది. తాను తన బిడ్డల్ని అలానే పెంచుతానని కూడా ప్రామిస్ చేసింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇలియానా చివరిగా దో ఔర్ దో ప్యార్ (2024)లో కనిపించింది. దీనికంటే ముందు `తేరా క్యా హోగా లవ్లీ (2022)`లో నటించింది. ఇటీవలే విడుదలై హిట్ కొట్టిన `రైడ్ 2`లో నటించాల్సి ఉన్నా తన వారసుల కారణంగా ఇలియానా ఆఫర్ ని తిరస్కరించిందని కథనాలొచ్చాయి. ఆ ప్లేస్ లో వాణీ కపూర్ నటించింది.
