Begin typing your search above and press return to search.

హిట్ మూవీ సీక్వెల్.. ఇలియానా కూడా ఫీలైందట!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ కొంతకాలంగా నడుస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Jun 2025 1:00 AM IST
హిట్ మూవీ సీక్వెల్.. ఇలియానా కూడా ఫీలైందట!
X

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ కొంతకాలంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ విధంగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు కూడా సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 2018లో ఫస్ట్ పార్ట్ విడుదలవ్వగా.. ఇప్పుడు సీక్వెల్ చిత్రీకరణ జరుగుతోంది. 2025 మే నెలలో షూటింగ్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేశారు మేకర్స్.

అయితే రైడ్ ఫస్ట్ పార్ట్ లో అజయ్ దేవగన్, ఇలియానా జంటగా నటించారు. కానీ ఇప్పుడు సీక్వెల్ లో ఇలియానా బదులు వాణీ కపూర్ కనిపించనున్నారు. ఇప్పటికే మేకర్స్ ఆ విషయాన్ని అనౌన్స్ చేశారు. దీంతో చాలా ఇలియానా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. మాలిని రోల్ లో ఇలియానాను మిస్ అయ్యామని ఇప్పటికే పోస్టులు పెట్టారు.

తాజాగా ఆ విషయంపై ఇలియానా రెస్పాండ్ అయ్యారు. "మేడమ్‌ జీ రైడ్‌ 2 సినిమాలో మీరెందుకు యాక్ట్ చేయడం లేదు? మీ కమ్‌బ్యాక్‌ ఎప్పుడు ఉంటుంది?" అని ఓ నెటిజన్ క్వశ్చన్ చేయగా.. సినిమాలను తానెంతో మిస్‌ అవుతున్నానని చెప్పారు. తనకు కూడా రైడ్ 2లో భాగం కావాలనిపించిందని ఇలియానా వెల్లడించారు.

"నిజానికి రైడ్ మూవీ నాకు చాలా స్పెషల్. మాలిని రోల్ లో మరోసారి సందడి చేయాలని అనుకున్నా. డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తాతోపాటు నటుడు అజయ్‌ దేవగన్ తో మరోసారి కలిసి వర్క్‌ చేయాలని నాకు కూడా ఉంది. సీక్వెల్‌ తెరకెక్కించాలనుకున్నప్పుడు మూవీ టీమ్ నన్ను అప్రోచ్ అయ్యారు. యాక్ట్‌ చేయమని అడిగారు" అని చెప్పారు.

"కానీ అప్పుడే నాకు బాబు పుట్టాడు. దీంతో నేను ఓకే చెప్పలేకపోయాను. ఏదేమైనా వాణీ కపూర్ కు రైడ్ 2తో మంచి గుర్తింపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా" అని తెలిపారు ఇలియానా. మరోవైపు, ఫ్యూచర్ లో సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని మరో నెటిజన్‌ ప్రశ్నించగా, తాను తప్పకుండా మూవీస్ మళ్లీ చేస్తానని చెప్పారు.

కాగా, 2023లో మైఖేల్‌ డోలన్‌ అనే వ్యక్తిను ఇలియానా వివాహం చేసుకున్నారు. అదే ఏడాది ఓ బాబుకు జన్మనిచ్చారు. ఇప్పుడు మరోసారి గర్భం దాల్చారు. త్వరలో మరో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. చివరగా ఆమె.. దో ఔర్ దో ప్యార్ మూవీలో నటించారు. ప్రతీక్ గాంధీతో కలిసి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. యాక్టింగ్ పరంగా మాత్రం ఆమెకు ప్రశంసలు వచ్చాయి.