Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ AR రెహమాన్ అంత‌టోడు పుట్టాడు!

ఇళయరాజా లిడియన్ గురించి మాట్లాడుతూ.. కుర్రాడు దయగలవాడు క్రమశిక్షణ గలవాడు. ''నేను ఏది కంపోజ్ చేసినా అతడు పూర్తిగా వింటాడు.. హృదయపూర్వకంగా అభినందిస్తాడు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 10:51 AM GMT
మ‌ళ్లీ AR రెహమాన్ అంత‌టోడు పుట్టాడు!
X

ఎనిమిదేళ్ల వయసులో చోపిన్, మొజార్ట్‌ని చెవిలో వాయించడం ప్రారంభించిన బాల సంగీత‌కారుడు ప్ర‌తిభావంతుడు- లిడియన్. ఇప్పుడు అత‌డి వ‌య‌సు 18. నాధస్వరం సంగీతం ద్వారా ప్రపంచ శాంతికి తోడ్పడాలని ఆకాంక్షిస్తున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా #అన్ స్టాప‌బుల్ 21 జ్యూరీ చెన్నైకి చెందిన 17 ఏళ్ల యువకుడిని 21 ఏళ్లలోపు తిరుగులేని 21 మంది భారతీయులలో ఒకరిగా ఎంపిక చేసింది. లిడియన్ నాధస్వరం స్పెష‌లిస్టు.. నాలుగు సంవత్సరాల వయస్సులో మృదంగం, డ్రమ్స్ వాయించడం ప్రారంభించాడు. ఎనిమిదేళ్ల వయసులో కీబోర్డ్‌పై చెవితో మోజార్ట్- చోపిన్ వాయించడం ప్రారంభించిన తర్వాత గొప్ప‌ ప్రతిభావంతుడైన పిల్లవాడని త‌న‌ తండ్రి గ్రహించాడు. 10 సంవత్సరాల వయస్సులో లిడియన్ ట్రినిటీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో పియానోలో గ్రేడ్ 8ని క్లియర్ చేసాడు. అక్కడ త‌న‌ గురువు అగస్టిన్ పాల్ సంగీతంలో మార్గనిర్దేశం చేశారు.

లిడియ‌న్ కేవలం 13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు CBS షో 'ది వరల్డ్స్ బెస్ట్'లో 1 మిలియన్ డాల‌ర్ గెలుచుకున్నాడు. కానీ 17 ఏళ్ల అతడిలో ఎల్ల‌పుడూ అత‌డి నిరంతర చిరునవ్వు అంత‌కుమించి విలువైన‌ది. అతడు కోర్సాకోవ్ 'ఫ్లైట్ ఆఫ్ ది బంబుల్ బీ'ని నిమిషానికి 325 బీట్స్‌తో ఆడాడు. ఇది అంత తేలికైన ఫీట్ కాదు... ఎల్ల‌పుడూ అతని ముఖంపై చిరునవ్వుతో ఇది సాధ్య‌మైంది. అత‌డు ఎల్లెన్ డిజెనెరెస్ షోలో కనిపించినప్పుడు స్వరమాంత్రికుడు, ఆస్కార్ గ్ర‌హీత‌ AR రెహమాన్ అతనిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అతని చిన్న ముఖంలో చిరునవ్వు అలాగే ఉంది.

ఒత్తిడిలోను ప్రశాంతంగా ఎలా ఉండగలవు? అని ప్ర‌శ్నిస్తే ఇలా అంటాడు. ''ఒకసారి మనం ఏదైనా పరిపూర్ణంగా సాధన చేస్తే, ఫలితాలు అందంగా సంతృప్తికరంగా ఉంటాయి. నేను వేదికపై ప్రదర్శన ఇచ్చిన ప్రతిసారీ ఆ అనుభూతిని పొందుతాను. నిజం చెప్పాలంటే నేను అనుభవించేది ఒత్తిడి కాదు. ప్రతి ఒక్క సంగీత ప్రియుడి విశ్వాసం, ప్రేమ , గౌరవం'' అని చెబుతాడు. ఆ యువ‌కుడి తండ్రి వెర్షన్ ప్ర‌కారం.. సతీష్ అనే తమిళ సంగీత దర్శకుడి బేషరతు మద్దతు కూడా ఈ విజ‌యాల‌కు సహాయపడింది. లిడియన్ .. అతని అక్క - గాయని కం ఫ్లూటిస్ట్ - ఇద్దరినీ చ‌దువుకోవాల‌ని ఒత్తిడి చేయ‌కుండా త‌మ‌కు తోచిన విద్య‌ను అనుసరించమని త‌న తండ్రి గారు ప్రోత్సహించాడు. నేను I - II తరగతులకు మాత్రమే పాఠశాలకు వెళ్లాను అని లిడియన్ చెప్పారు.

మోహన్‌లాల్ దర్శకత్వం వహించిన 'బరోజ్' - పిల్లల సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ. ఈ చిత్రానికి లిడియన్ స్వరపరిచిన సంగీత విజ్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మోహన్‌లాల్‌ సార్‌ మాకు కుటుంబం. నేను ఇటీవలే నా తొలి జాజ్ ఆల్బమ్ క్రోమాటిక్ గ్రామాటిక్‌ని విడుదల చేసాను. లాల్ సార్ విడుదలకు హాజరయ్యారు.. అని తెలిపాడు. లిడియన్ ప్రస్తుతం సంగీత విద్వాంసుడు ఇళయరాజా చే మార్గదర్శకత్వం పొందుతున్నాడు. ఇప్పటి వరకు రాజాకు ఏకైక విద్యార్థిగా లిడియ‌న్ ప‌రిగ‌ణ‌న‌లోకొచ్చాడు.

ఇళయరాజా లిడియన్ గురించి మాట్లాడుతూ.. కుర్రాడు దయగలవాడు క్రమశిక్షణ గలవాడు. ''నేను ఏది కంపోజ్ చేసినా అతడు పూర్తిగా వింటాడు.. హృదయపూర్వకంగా అభినందిస్తాడు. ఇటీవల నేను వేదికపై అతని కంపోజిషన్‌ను ప్లే చేసాను. 40 సంవత్సరాలలో అటువంటి సంక్లిష్టమైన కంపోజిషన్‌ను వాయించిన మొదటి వ్యక్తి నేనే'' అని అన్నారు. వాస్తవానికి క్లాసికల్ గిటార్‌కు కంపోజ్ చేసి, పియానోలో అన్ని సూక్ష్మ నైపుణ్యాలతో కూడిన కంపోజిషన్‌ను ప్లే చేసానని రాజా తెలిపారు. లిడియన్‌కు పట్టం కట్టిన అరుదైన‌ సందర్భం ఏమిటంటే.. అత‌డు న్యూయార్క్ నుండి చెన్నైకి డెలివరీ చేసిన 'స్టెయిన్‌వే అకౌస్టిక్ గ్రాండ్ పియానో'ను అందుకున్నాడు. ఇది సంగీత వ్యసనపరుడు మైఖేల్ నోవోగ్రాట్జ్ నుండి బహుమతి. లిడియన్ ఒకసారి న్యూయార్క్‌లో నోవోగ్రాట్జ్ కంటే ముందు వేదిక‌పై త‌న ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. అయితే నోవోగ్రాట్జ్ అతని నైపుణ్యాలను చూసి ముగ్ధుడయ్యాడు. ఇప్పుడు కానుక‌నే పంపాడు.

ఆస్కార్ గ్ర‌హీత AR రెహమాన్ లిడియన్‌ను అనేక ఇంటర్వ్యూలలో 'భారత సంగీత రాయబారి'గా అభివర్ణించారు. అతను నన్ను 'బడ్డీ' అని పిలుస్తాడు. ఇది త‌న‌తో నాకు బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అతను నాకు వ్యక్తిగతంగా ఉపయోగించే రోలీ కీబోర్డ్ హార్పెజ్జీని బహుమతిగా ఇచ్చాడు. సంగీతంలో ఏదైనా కొత్తగా చేయమని ఎప్పుడూ సలహా ఇస్తూ నేను అతనిని గర్వపడేలా చేస్తాను... అని రెహ‌మాన్ అన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని వ‌య‌సుల సంగీత‌జ్ఞులు అత‌డికి స్నేహితులు. ఇప్పుడు అతడి వ‌య‌సు 18 ఏళ్లు. నేను కూడా కాల పరీక్షకు నిలబడే సంగీతాన్ని కంపోజ్ చేయాలనుకుంటున్నానని అత‌డు ఆశాభావం వ్య‌క్తం చేసాడు. మరీ ముఖ్యంగా బాధ్యతాయుతమైన సంగీతకారుడిగా.. మంచి మానవుడిగా ఉండాలనుకుంటున్నానని అన్నారు. నేను నా సంగీతం ద్వారా ప్రపంచ శాంతికి దోహదపడాలనుకుంటున్నాను. మంచి సంగీతకారుడు ఎలా ఉండాలో ఉదాహరణగా నిల‌వాలనుకుంటున్నాను... అని తెలిపాడు.