Begin typing your search above and press return to search.

ఇళయరాజా బయోపిక్, హీరో ఎవరో తెలుసా?

గత కొంతకాలంగా ఇళయరాజా బయోపిక్ ను డైరెక్టర్ బాల్కీ తీయబోతున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది

By:  Tupaki Desk   |   3 Aug 2023 11:20 AM GMT
ఇళయరాజా బయోపిక్, హీరో ఎవరో తెలుసా?
X

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తెలియని వారు ఉండరు. ఆయన తన మ్యూజిక్ తో సంగీత ప్రపంచాన్ని ఏలేశారు. చాలా సినిమాలకు ఆయన తన సంగీతంతో ప్రాణం పోశాడు. ఆయన మ్యూజిక్ అంటే చెవులు కోసుకునేవాళ్లు ఉన్నారు. ఇప్పటికీ , ఎప్పటికీ ఆయన పాటలు వింటే ప్రాణం లేచివచ్చినట్లుగా ఉంటుంది. ఏకాలం వారినైనా తన మ్యూజిక్ తో కట్టిపడేయగలరు. అలాంటి ఆయన నిజ జీవిత కథను మనం త్వరలోనే తెరపైన చూడబోతున్నాం.

మణిశర్మ జీవిత కథ ఆధారంగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాగా, ఆ సినిమాలో ఆయన పాత్ర పోషించడానికి ఓ స్టార్ హీరోని ఎంపిక చేయడం విశేషం. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ధనుష్. గత కొంతకాలంగా ఇళయరాజా బయోపిక్ ను డైరెక్టర్ బాల్కీ తీయబోతున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుంగా ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అది నిజమని తెలుస్తోంది. ధనుష్ ని ప్రధాన పాత్రగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట.

ఈ విషయాన్ని డైరెక్టర్ బాల్కీ స్వయంగా వెల్లడించడం విశేషం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. తాను ఇళయరాజా జీవిత కథ ఆధారంగా సినిమా తీయాలని అనుకుంటన్నానని, ధనుష్ అయితే బాగుంటాడని అనిపించింది, ధనుష్ కూడా నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు అని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా, ఇళయరాజా తన కెరీర్ లో దాదాపు 1500 సినిమాలకు సంగీతం అందించారు. ఆయన ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 2018లో భారత ప్రభుత్వం ఈయనను "పద్మవిభూషణ్" పురస్కారంతో సత్కరిచింది. అంతేకాకుండా 2022 జూలై 6న రాజ్యసభకు నామినేట్ కూడా అయ్యారు.

ఇప్పుడు ఆయన కథతో సినిమా అంటే, ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఈ మూవీ మొదలుపెట్టడానికి సమయం పట్టొచ్చు. ఎందుకంటే, ప్రస్తుతం ధనుష్ చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. అవి పూర్తైన తర్వాత, ఈ మూవీ మొదలుపెట్టే అవకాశం ఉంది.