Begin typing your search above and press return to search.

ఇండియాలో ఆపితే హాలీవుడ్ మూవీస్ చేసుకుంటా

మొదటి సినిమాలోనే ఎక్స్ ట్రీమ్ ఎమోషన్స్ లో హీరో క్యారెక్టరైజేషన్ ని చూపించి అలాంటి వాడికి లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.

By:  Tupaki Desk   |   18 Feb 2024 1:30 AM GMT
ఇండియాలో ఆపితే హాలీవుడ్ మూవీస్ చేసుకుంటా
X

అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాలోనే ఎక్స్ ట్రీమ్ ఎమోషన్స్ లో హీరో క్యారెక్టరైజేషన్ ని చూపించి అలాంటి వాడికి లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే మూవీలో కొన్ని సీన్స్, డైలాగ్స్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

కాంట్రవర్సీ కూడా మూవీకి ప్లస్ అయ్యింది. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చేస్తే యువత చెడిపోతారు అంటూ చాలా మంది మైక్ ల ముందుకి హడావిడి చేశారు. ఆ సమయంలోనే సందీప్ రెడ్డి ఆసక్తికర వాఖ్యలు చేశారు. తెలుగులో తన సినిమాలు అడ్డుకుంటే బాలీవుడ్ కి వెళ్లి మూవీస్ చేసుకుంటా అని అన్నారు. అలాగే బాలీవుడ్ లోకి వెళ్లి అర్జున్ రెడ్డి రీమేక్ చేసి హిట్ కొట్టారు. దానిపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.

తాజాగా యానిమల్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో హింసని ఎక్కువగా చూపించాడు. అలాగే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పై కొంతమంది సెలబ్రెటీలు విమర్శలు చేశారు. మరీ హీనంగా చూపించారని కామెంట్స్ చేశారు. తనపై విమర్శలు చేసిన అందరికి సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూలలో సమాధానం చెబుతూనే ఉన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమాపై విమర్శకులు కామెంట్స్ చేస్తే అస్సలు పట్టించుకొను అని అన్నారు, అయితే ఇండస్ట్రీలో ఉండే సెలబ్రెటీలు కూడా అన్ని తెలిసి మూవీపై విమర్శలు చేయడం కాస్తా బాధగా ఉందని అన్నారు. ఇండియాలో కూడా నన్ను సినిమాలు చేయనీయకపోతే హాలీవుడ్ కి వెళ్లి మూవీస్ చేస్తా అంటూ కామెంట్స్ చేశారు.

నాకు భాషా పరిమితులు లేవు. ఏ లాంగ్వేజ్ లో అయిన చేస్తా అంటూ కామెంట్స్ చేశారు. అర్జున్ రెడ్డి సమయంలో సందీప్ రెడ్డి కామెంట్స్ చేసినట్లుగానే బాలీవుడ్ లోకి వెళ్లి మూవీస్ చేస్తూ సక్సెస్ కొడుతున్నారు. స్పిరిట్ మూవీ కూడా పాన్ వరల్డ్ మూవీగానే తెరకెక్కిస్తున్నారు. ఇంగ్లీష్ లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో సక్సెస్ కొడితే సందీప్ రెడ్డి నెక్స్ట్ హాలీవుడ్ సినిమా చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి.