Begin typing your search above and press return to search.

దేవా కోసం డోసు పెంచుతున్న బుట్ట బొమ్మ..!

లాస్ట్ ఇయర్ సల్మాన్ తో కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలో నటించిన పూజా హెగ్దే ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో సైలెంట్ అయిపోయింది.

By:  Tupaki Desk   |   25 April 2024 3:32 AM GMT
దేవా కోసం డోసు పెంచుతున్న బుట్ట బొమ్మ..!
X

సౌత్ లో నిన్న మొన్నటిదాకా టాప్ హీరోయిన్ గా చలామణి అయిన పూజా హెగ్దే సడెన్ గా ఆఫర్లు లేక కెరీర్ డైలమాలో పడేసుకుంది. టాలీవుడ్ మేకర్స్ పూజా బేబీని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన హీరోయిన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. పూజా హెగ్దే కూడా తెలుగులో ఒక మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది. అయితే ఈలోగా బాలీవుడ్ లో వచ్చిన ఛాన్సులను చేస్తూ వస్తుంది. లాస్ట్ ఇయర్ సల్మాన్ తో కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలో నటించిన పూజా హెగ్దే ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో సైలెంట్ అయిపోయింది.

ఇటు టాలీవుడ్ లో కూడా కెరీర్ ఆశాజనకంగా లేదు అందుకే వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. ప్రస్తుతం అమ్మడు షాహిద్ కపూర్ తో దేవా సినిమాలో నటిస్తుంది. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ సినిమాలో షాహిద్ కపూర్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ దసరాకి రిలీజ్ టార్గెట్ చేసిన దేవ సినిమాలో పూజా హెగ్దే రెచ్చిపోతుందని తెలుస్తుంది.

వచ్చిన ఒక్క ఛాన్స్ ని అన్ని విధాలుగా వాడుకునేందుకు సిద్ధమైన బుట్ట బొమ్మ దేవా సినిమాలో గ్లామర్ ట్రీట్ లో నెక్స్ట్ లెవెల్ డోస్ పెంచేస్తుందట. దేవా లో షాహిద్ తో లిప్ లాక్ కూడా ఉంటుందని టాక్. పూజా హెగ్దే ఈసారి తన అందాలనే ఎరగా వేస్తూ ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టాలని చూస్తుంది. దేవాలో షాహిద్ కపూర్, కథ కథనాలు ఒక సైడ్ అయితే పూజా బేబీ గ్లామర్ మరో సైడ్ అనిపించేలా చేస్తుందట.

తెలుగులో గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అవ్వడమే ఆమె చేసిన పొరపాటు కాగా ఆ తర్వాత అమ్మడికి ఒక్కటంటే ఒక్క ఛాన్స్ రావట్లేదు. నాగ చైతన్య నెక్స్ట్ సినిమాలో పూజా హెగ్దే నటిస్తుందని వార్తలు వచ్చాయి. తెలుగు ఎంట్రీ అక్కినేని హీరో నాగ చైతన్యతోనే ఇచ్చిన పూజా హెగ్దే మళ్లీ ఈ టఫ్ టైం లో అతని సినిమాలోనే ఛాన్స్ అందుకుంటుంది. బాలీవుడ్ లో దేవా హిట్ అయితే అక్కడ పూజా తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగులో మాత్రం ఆమె సినిమా ఓకే చేసే దాకా ఇలా వార్తలు వస్తూనే ఉంటాయి. పూజా తెలుగు సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి అమ్మడు తెలుగు ఆఫర్ ఏది ఫైనల్ అవుతుందో చూడాలి.