'ఐకాన్' కు స్టార్ హీరో రెడీనా?
ఐకాన్ ప్రాజెక్ట్ గుర్తుందా? కొన్ని నెలల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఆ సినిమాను అనౌన్స్ చేశారు.
By: Tupaki Desk | 2 July 2025 11:09 AM ISTఐకాన్ ప్రాజెక్ట్ గుర్తుందా? కొన్ని నెలల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఆ సినిమాను అనౌన్స్ చేశారు. వకీల్ సాబ్ తో అలరించిన తర్వాత వేణు శ్రీరామ్.. పుష్ప మూవీకి ముందు బన్నీతో ఐకాన్ మూవీని ప్రకటించారు. అందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా అప్పట్లో ఐకాన్ మేకర్స్ విడుదల చేశారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఆ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. మేకర్స్ రెస్పాండ్ కూడా అవ్వలేదు. రీసెంట్ గా ఆ సినిమా కచ్చితంగా తీస్తామని దిల్ రాజు తెలిపారు. వేణు శ్రీరామ్ తో ఆయన నిర్మిస్తున్న తమ్ముడు మూవీ ప్రమోషన్స్ లో చెప్పారు.
అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా చేయడం లేదని వెల్లడించారు. బన్నీ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఐకాన్ సినిమా చేసే అవకాశం లేదని, అందుకే వేరే హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. తమ్ముడు రిలీజ్ అయ్యాక ఐకాన్ స్క్రిప్ట్ ను వేణు ముందుకు తీసుకెళ్తారని తెలిపారు. అది యూనివర్సల్ స్క్రిప్ట్ అని అన్నారు.
ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో వేణు.. ఐకాన్ మూవీ గురించి మాట్లాడారు. ఆ సినిమా మరో స్టార్ హీరోతో తీయనున్నామని తెలిపారు. అల్లు అర్జున్ కు చెప్పిన స్టోరీలో చిన్న చిన్న మార్పులు ఉంటాయని అన్నారు. స్టార్ నటుడు యాక్ట్ చేయనున్నారని వెల్లడించారు. దిల్ రాజు ఇప్పటికే ఓ హీరో మాట్లాడుతున్నారని చెప్పారు.
దీంతో త్వరలోనే అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. క్యాస్టింగ్ సహా పలు వివరాలను ప్రకటించనున్నారని వినికిడి. 2025 చివర్లో షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ఐకాన్ మూవీ కోసం దిల్ రాజు.. యంగ్ హీరో విజయ్ దేవరకొండను సంప్రదించారని ప్రచారం జరుగుతోంది.
ఎందుకంటే.. దిల్ రాజు బ్యానర్ తో విజయ్ దేవరకొండకు మంచి రిలేషన్ ఉంది. ఐకాన్ సినిమా కోసం భారీగా లుక్ ఛేంజ్ చేసుకుని కష్టపడాల్సి ఉందట. అందుకే మంచి ఫిజిక్ ఉన్న విజయ్ వైపే దిల్ రాజు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని సమాచారం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో హ్యూమన్ యాక్షన్ మూవీగా రానున్న ఐకాన్ లో ఎవరు నటిస్తారో వేచి చూడాలి.
