Begin typing your search above and press return to search.

ప్రియురాలి కౌగిలిలో సైఫ్ న‌ట‌వార‌సుడు

ఇటీవ‌ల వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలో ఇబ్రహీం పాలక్ వైపు నడిచుకుని వెళ్లి త‌న‌ను గ‌ట్టిగా కౌగిలించుకున్నాడు. వారిద్దరూ ఒకరితో ఒకరు ఆ అంద‌మైన‌ క్షణాన్ని ఆస్వాధించ‌డం క‌నిపించింది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 1:30 AM GMT
ప్రియురాలి కౌగిలిలో సైఫ్ న‌ట‌వార‌సుడు
X

ఇబ్రహీం అలీఖాన్ -పాలక్ తివారీ ప్రేమ వ్యవహారం నిరంత‌రం హెడ్ లైన్స్ లోకి వ‌స్తోంది. ఇది స్నేహ‌మా? ప్రేమా? అన్న‌దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు ఫైర్ యాడెడ్ టు ది పెట్రోల్ అన్న చందంగా.. ఇబ్రహీం తన గాళ్ ఫ్రెండ్ పాలక్ తివారీని కౌగిలించుకున్న ఒక‌ వీడియో అంత‌ర్జాలంలో వైరల్ అవుతోంది. ఈ వీడియో మ‌రోసారి ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు తావిచ్చింది.

ఇటీవ‌ల వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలో ఇబ్రహీం పాలక్ వైపు నడిచుకుని వెళ్లి త‌న‌ను గ‌ట్టిగా కౌగిలించుకున్నాడు. వారిద్దరూ ఒకరితో ఒకరు ఆ అంద‌మైన‌ క్షణాన్ని ఆస్వాధించ‌డం క‌నిపించింది. ఇబ్రహీం -పాలక్ వ్యక్తిగత జీవితాల చుట్టూ ఉన్న ఆసక్తి అంద‌రిలోను అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. ఈ వీడియో చూశాక‌ అభిమానులు ఆ ఇద్దరి మధ్య ఏదో జ‌రుగుతోంద‌ని భావించ‌డం ఖాయం.

ఇబ్రహీం - పాలక్ మొదటిసారి డిన్నర్ డేట్ లో క‌లిసి హోట‌ల్ నుంచి బయటికి వచ్చినప్పుడు అంద‌రి దృష్టిని ఆకర్షించారు. పాలక్ తన ముఖాన్ని కెమెరాల‌కు చిక్క‌కుండా దాచిపెట్టింది. అయితే త‌న వైఖ‌రిని నెటిజనులు భారీగా ట్రోల్ చేసారు. తరువాత ఇబ్రహీంను కేవలం స్నేహితుడు మాత్ర‌మేన‌ని పాల‌క్ వ్యాఖ్యానించింది. అత‌డు ఒక స్నేహితుడు. మేం ఎక్కడికి వెళ్లినా కేవ‌లం స్నేహితులుగానే.. అని తెలిపింది. సోషల్ మీడియాల్లో అతనితో ఢీకొట్టడం నాకు చాలా ఇష్టం.. కానీ మనం ప్రతిరోజూ మెసేజ్‌లు పంపే రొటీన్ స్నేహితుడు కాదు. అతడికి నేను అంటే ఇష్టం... అని తెలిపింది.

ఇటీవల ఇబ్రహీం- పాలక్ ఇద్దరూ చాలా త‌రచుగా క‌లిసి క‌నిపిస్తున్నారు. స్టార్ కిడ్స్ తల్లిదండ్రులు ఇద్దరూ వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. ఇబ్రహీం తరచుగా బహిరంగంగా కనిపిస్తాడు, కానీ అతను -పాలక్ ఇద్దరూ కలిసి ఫోటోలు దిగాలంటే వ్య‌తిరేకిస్తాడు.

పాలక్ ఇప్పటికే సల్మాన్ ఖాన్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఇబ్రహీం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్ర లేదు.. కానీ 90ల నాటి మేటి న‌టి కాజోల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇబ్రహీం తన తొలి చిత్రం షూటింగ్‌ను పూర్తి చేశాడు. మ‌రోవైపు సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖాన్ క‌థానాయ‌కుడిగా డెబ్యూ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. ఇంత‌లోనే రెండో సినిమాలోను అత‌డు అవ‌కాశం ద‌క్కించుకున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి.