Begin typing your search above and press return to search.

కూతురు లైఫ్ సెట్టు, ఇక కొడుకుపై సైఫ్ ఫోకస్..!

ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అడుగుజాడల్లో ఇబ్రహీం బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు

By:  Tupaki Desk   |   26 Aug 2023 12:31 PM GMT
కూతురు లైఫ్ సెట్టు, ఇక కొడుకుపై సైఫ్ ఫోకస్..!
X

సైఫ్ అలీఖాన్ పరిచయం అవసరం లేని పేరు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ మధ్యనే ఆయన హీరో నుంచి విలన్ క్యారెక్టర్లపై ఫోకస్ పెట్టారు. అయితే, బాలీవుడ్ లో కాకుండా, ఇతర భాషల్లో విలన్ రోల్స్ చేస్తూ, మరింత క్రేజ్ పెంచుకుంటున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ లో రావణాసురుడి పాత్ర పోషించారు. ఆయన పాత్రను డిజైన్ చేసిన విధానంపై విమర్శలు వచ్చినా, ఆయన నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. ఇక, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాలోనూ ఆయన విలన్ గా కనపడనున్నారు.

ఆయన సంగతి పక్కన పెడితే, సైఫ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ముద్దుల కుమార్తె సారా అలీఖాన్ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. యంగ్ హీరోల సరసన నటిస్తోంది. దాదాపు సారా కెరీర్ బాలీవుడ్ లో సెట్ అయినట్లే అని చెప్పాలి. దీంతో, ఇప్పుడు సైఫ్ తన కొడుకు ఇబ్రహీం ని హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నారు.

ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అడుగుజాడల్లో ఇబ్రహీం బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. తొలి సినిమా పేరు సర్జమీన్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ కుమారుడు కయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్, ప్రముఖ దక్షిణాది నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర పోసిస్తున్నారు.

అయితే, ఈ మూవీలో ఇబ్రహీం సరసన ఎలాంటి హీరోయిన్ ని తీసుకోవడం లేదని తెలుస్తోంది. కాజోల్ రోల్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా ఉంటుందని సమాచారం. ఇక, ఇబ్రహీం విషయానికి వస్తే, అచ్చం తన తండ్రి పోలికలతోనే ఉంటాడు. సైఫ్ ని యంగ్ లుక్ లో చూసినట్లే ఉంటాడు.

ఇక, తండ్రి వారసత్వాన్ని కచ్చితంగా నెలపెడతాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి తొలి సినిమాతో ఇబ్రహీం ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక, మూవీ స్టోరీ కూడా చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.